హరీష్‌రావుకి విజయశాంతి బాసట

హరీష్‌రావుకి విజయశాంతి బాసట

తెరాస నేత హరీష్‌రావుకి బాసటగా నిలిచారు మెదక్‌ ఎంపి విజయశాంతి. పద్మాలయా భూముల గొడవలో హరీష్‌రావు 80 లక్షలకు సెటిల్‌మెంట్‌ చేశారని, ఆ సెటిల్‌మెంట్‌ అంతా విజయశాంతి ఇంట్లో జరిగిందని టిఆర్‌ఎస్‌ నుండి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ఆరోపించగా, వాటిని విజయశాంతి ఖండించడంతో హరీష్‌రావుకి ఊరట కలిగింది.

తన ఇంట్లో సెటిల్‌మెంట్‌ జరిగిందనడం అవాస్తవం అన్న విజయశాంతి, ఒకవేళ రఘునందన్‌ వద్ద ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాండు చేయడం జరిగింది. ఇప్పటికే హరీష్‌రావుని రఘునందన్‌ ఆరోపణల నుంచి కాపాడేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కుమారుడు, కుమార్తె కూడా రంగంలోకి దూకారు.

కెసిఆర్‌కి రాజకీయాల్లో చెల్లెమ్మ అయిన విజయశాంతి కూడా హరీష్‌రావుని వెనకేసుకు రావడంతో రఘునందన్‌ ఆరోపణలు తేలిపోయాయి. తాను చేసిన ఆరోపణలు నిజమని రఘునందన్‌ ఇంకా భావిస్తుంటే, ఆయన తన వద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టవలసి ఉంటుంది. రఘునందన్‌ చేస్తారా ఆ పని?