సస్పెన్స్‌లో పెట్టిన త్రివిక్రమ్‌

 సస్పెన్స్‌లో పెట్టిన త్రివిక్రమ్‌

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌, అల్లు అర్జున్‌... ఇలా ప్రస్తుతం టాప్‌లో వున్న హీరోలతో పని చేస్తూ వస్తోన్న త్రివిక్రమ్‌ మధ్యలో నితిన్‌తో 'అఆ' సినిమా చేసాడు. తాజాగా వెంకటేష్‌తో సినిమా అనౌన్స్‌ చేసాడు. వెంకీ బర్త్‌డేకి హారిక హాసిని సంస్థ వెంకీతో త్రివిక్రమ్‌ సినిమా అనౌన్స్‌ చేయడం ఆశ్చర్యపరచింది. ఎన్టీఆర్‌తో సినిమా ఇంకా మొదలు కాకుండానే వెంకీతో మలి చిత్రాన్ని త్రివిక్రమ్‌ ఓకే చేసేసుకున్నాడు.

అయితే ఈ చిత్రం వెంకీతో సోలో వెంఛరా లేక మరో హీరోతో కలిసి మల్టీస్టారర్‌ చేస్తాడా అనేది తెలీదు. అయితే మాటల సందర్భంలో ఒకసారి త్రివిక్రమ్‌ తనని ఒక మల్టీస్టారర్‌ కథతో అప్రోచ్‌ అయినట్టు వెంకటేష్‌ చెప్పాడు. మల్టీస్టారర్‌ అయితే కనుక వెంకీతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకునే మరో హీరో ఎవరనేది ఆసక్తి రేకెత్తించే విషయమే. సింపుల్‌గా వెంకీతో సినిమా వుందని మాత్రం అనౌన్స్‌ చేసిన హారిక హాసిని సంస్థ మిగతా డీటెయిల్స్‌ ఇవ్వలేదు. వచ్చే ఏడాది మొత్తం త్రివిక్రమ్‌కి ఎన్టీఆర్‌ సినిమా పని వుంటుంది కనుక వెంకీ సినిమా 2019లోనే సెట్స్‌ మీదకి వెళుతుంది.

ఈలోగా ఈ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్‌ బయటకి రావచ్చు. త్రివిక్రమ్‌ అయితే ఒక మల్టీస్టారర్‌ సినిమా చేయాలనే ఆలోచన కొంత కాలంగా చేస్తున్నట్టు ఖచ్చితమైన సమాచారం వుంది. అది ఈ ప్రాజెక్టే అయినట్టయితే వెంకీతో టీమ్‌ అయ్యే ఆ ఇంకో హీరో ఎవరో చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు