ప్ర‌పంచానికి అర‌వింద్ విల‌న్ గా క‌నిపిస్తాడు.. ఆయ‌న ఖ‌ర్మ‌

ప్ర‌పంచానికి అర‌వింద్ విల‌న్ గా క‌నిపిస్తాడు.. ఆయ‌న ఖ‌ర్మ‌

తెర వెనుక దాస‌రి పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు రాఘ‌వేంద్ర‌రావు.. అల్లు అర‌వింద్‌.. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌.. ముర‌ళీమోహ‌న్‌.. ప‌రుచూరి.. జీవిత రాజ‌శేఖ‌ర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

అయితే.. అంత‌మంది హాజ‌రైనా.. ఈ కార్య‌క్ర‌మానికి అటెండ్ అయిన సీనియ‌ర్ న‌టుడు ఆర్ నారాయ‌ణ‌మూర్తి చేసిన ప్ర‌సంగం హాట్ టాపిక్ గా మారింది. ఓపెన్ గా మాట్లాడే ఆయ‌న నోటి వెంట ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లెన్నో వ‌చ్చాయి. దాదాపు పావు గంట సేపు ప్ర‌సంగించిన ఆయ‌న నోటి వెంట సినీ ప్ర‌ముఖుల‌ను ప్ర‌స్తావిస్తూ.. వారి గురించి కాస్త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ముఖ చిత్ర నిర్మాత‌.. చిరంజీవి బావ‌మ‌రిది అయిన అల్లు అర‌వింద్ గురించి ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌పంచానికి ఆయ‌నో పెద్ద చ‌ట్రంగా క‌నిపిస్తార‌ని.. అందరూ ఆయ‌న్ను విల‌న్ గా చూస్తార‌ని.. అది ఆయ‌న ఖ‌ర్మ‌గా అభివ‌ర్ణించారు. అర‌వింద్ ఏ న‌క్ష‌త్రంలో పుట్టారో కానీ ఆయ‌న్ను అర్థం చేసుకునే క‌న్నా అపార్థ‌మే చేసుకుంటార‌న్నారు.

త‌న‌కు తెలిసి ఆయ‌నంత స్నేహ‌పూర్వ‌క‌మైన వ్య‌క్తి తాను ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌లేద‌ని..చాలా స‌హాయ‌కారి అని.. అలాంటి మ‌నిషిపై ఎందుకంత త‌ప్పుడు ప్ర‌చారం చేస్తారో అంటూ నారాయ‌ణ మూర్తి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా ప్ర‌సంగించారు. ఇప్పుడాయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగానే కాదు.. సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవుతున్నాయి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు