జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అట్ట‌ర్ ఫ్లాప్‌

జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అట్ట‌ర్ ఫ్లాప్‌

త‌ప్పు.. త‌ప్పు అంటూ నిత్యం రంకెలు వేసే వాళ్లు తాము చెబుతున్న త‌ప్పును చేయ‌కూడ‌దు. కానీ.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇందుకు భిన్నం. ఓప‌క్క త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ గుండెలు బాదుకుంటూనే మ‌రోవైపు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను అమ‌లు చేస్తుంటారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌మ పార్టీ ఎమ్మెల్యేల్ని లాగేసుకుంటున్నార‌ని.. ఒక్కో ఎమ్మెల్యే కోసం పాతిక కోట్ల రూపాయిల‌కు పైనే ఇస్తున్న‌ట్లుగా చెబుతారు. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా ఆ మొత్తం రూ.50 కోట్ల‌కు కూడా చేరుకుంటూ ఉంటుంది.

ఒక‌వేళ‌.. చంద్ర‌బాబు నిజంగా అంత భారీ మొత్తం ఇస్తుంటే.. జ‌గ‌న్ చూస్తూ ఊరుకుంటాడా? ఈ పాటికి ఏదో రీతిలో సీడీలు త‌యారు చేసే వారు క‌దా. నీతులు చెప్పే జ‌గ‌న్‌.. గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆప‌రేష‌న్ ఆకర్ష్ ను అమ‌లు చేస్తున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అధికార‌ప‌క్షం వారు చేసే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను చూసి స్ఫూర్తి పొంది అమ‌లు చేయాలంటే అడ్డంగా బుక్ కావ‌టం ఖాయం. తాజాగా ఇలాంటి ప్ర‌య‌త్నం చేసి వేలెత్తి చూపించుకుంటున్నారు వైఎస్ జ‌గ‌న్?

త‌న‌ను పార్టీ మారాలంటూ జ‌గ‌న్ పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చిన వైనాన్ని బ‌య‌ట‌పెట్టారు చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీ‌నాథ‌రెడ్డి. టీడీపీని వ‌దిలి త‌మ‌పార్టీలోకి వ‌స్తే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆఫ‌ర్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. కొద్దిరోజుల క్రితం త‌మ పార్టీలోకి చేరిన న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంగా చెప్పారు. అయితే.. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి త‌న‌ను అన్న‌లా భావిస్తున్న వేళ తాను ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు చెప్పారు. నీతులు చెప్పే జ‌గ‌న్‌.. ఇలాంటి పాడు ప‌నులు చేయ‌టం ఏమిటో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు