గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి మోడీ ఎంత ఖ‌ర్చు చేశారంటే...

గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి మోడీ ఎంత ఖ‌ర్చు చేశారంటే...

37,54,06,23,616.. ఈ అంకెల్ని లెక్కెట్టాకే వార్త‌ చ‌ద‌వండి. చూసినంత‌నే అంకెలుచాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అదే టైంలో లెక్కించే ప‌నిలో ప‌డితేనే ఇబ్బంది అంతా. ఒక్క‌సారిగా ఓకే అనుకోలేం. ఒక‌టికి రెండుసార్లు లెక్కేస్తే త‌ప్ప క‌న్ఫ‌ర్మ్ చేసేకోలేం. అంకెల ముచ్చ‌ట త‌ర్వాత‌.. దీని వెనుక ఉన్న ఆస‌క్తిక‌ర అంశాన్ని చూద్దాం.

మీరు లెక్క పెట్టిన అంకెల్ని సింఫుల్గా చెప్పాలంటే రూ.3754(మూడు వేల ఏడువంద‌ల యాభైనాలుగు కోట్లు) కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని మూడున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తాపార్టీ ఖ‌ర్చు చేసింది. ఎందుకో తెలుసా?  జాతి జ‌నుల మ‌న‌సుల్ని ప్ర‌భావితం చేసేందుకు.  అదేనండి ప‌బ్లిసిటీ కోసమ‌న్న మాట‌.

ఈ అక్టోబ‌రు చివ‌ర‌కు.. అంటే మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన నాటి నుంచి మూడున్న‌రేళ్ల కాలంలో మోడీ స‌ర్కారు ప‌బ్లిసిటీ కోసం పెట్టిన ఖ‌ర్చు లెక్క ఆర్జీఐ పుణ్య‌మా అని బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రింట్.. ఎల‌క్ట్రానిక్ మీడియాతో పాటు అవుట్ డోర్ ప‌బ్లిసిటీ ద్వారా పెట్టిన ఖ‌ర్చుగా కేంద్రం పేర్కొంది.

గ్రేట‌ర్ నొయిడాకు చెందిన సామాజిక కార్య‌క‌ర్త రామ్‌వీర్ త‌న్వార్ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తు వేర‌కు స‌మాచార ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ ఈ ఖ‌ర్చు లెక్క‌ను వెల్ల‌డించింది. త‌మ వ‌ద్ద అందుబాటులో ఉన్న రికార్డుల ప్ర‌కారం ఎల‌క్ట్రానిక్ మీడియాకు ప్ర‌క‌ట‌న‌ల రూపంలో రూ.1656 కోట్లు.. ప్రింట్ మీడియాకు రూ.1698 కోట్లు ఖ‌ర్చుచేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో హోర్డింగ్స్‌.. పోస్ట‌ర్స్‌.. బుక్ లెట్స్‌.. క్యాలెండ‌ర్స్ లాంటి అవుట్ డోర్ ప్ర‌క‌ట‌న‌ల కోసం మ‌రో రూ.399 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక‌.. న‌రేంద్ర‌మోడీ ఫీచ‌రింగ్ గా వ‌చ్చిన ప్ర‌క‌ట‌న‌ల కోసం 2014 జూన్ నుంచి 2016 ఆగ‌స్టు 31 వ‌ర‌కు రూ.1100 కోట్లకు పైగా కేంద్రం ఖ‌ర్చు చేసిన‌ట్లు త‌న్వార్ స్ప‌ష్టం చేశారు.  ప్ర‌ధాని మోడీ మాన‌స‌పుత్రిక అయిన మ‌న్ కీ బాత్ కార్య‌క్ర‌మాన్ని అచ్చేసేందుకు ఒక్క న్యూస్ పేప‌ర్ ప్ర‌క‌ట‌నకే రూ.8.5 కోట్లు ఖర్చు చేసిన‌ట్లుగా వెల్ల‌డైంది. మౌన ప్ర‌ధాని.. మౌన సింగ్ అంటూ వ్యంగ్యంగా అనుకునే వారంతా.. ఈ ఖ‌ర్చు లెక్క చూస్తే.. మాట్లాడే ప్రధాని ఎంత ఖ‌రీదైన వ్య‌వ‌హార‌మో ఇట్టే తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు