పానీపూరీ తినేట‌ప్పుడు ఆ త‌ప్పు.. ప్రాణాలు పోయాయ్‌

పానీపూరీ తినేట‌ప్పుడు ఆ త‌ప్పు.. ప్రాణాలు పోయాయ్‌

పానీపూరీని ఇష్ట‌ప‌డ‌ని వారంటూ ఉండ‌రు. స‌ర‌దాగా తినేకొద్దీ మ‌రికొన్ని తినేయాల‌నిపించేలా ఉంటే పానీపూరీని ఎన్నిసార్లు తిన్నా త‌నివి తీర‌దు. అయితే.. అలాంటి పానీపూరీలో ప్రాణాలు తీసే కోణం కూడా ఉంది. గుట్టుక్క‌న నోట్లో పెట్టేసుకొని.. హ‌డావుడిగా తినేసే వైనం క‌నిపిస్తుంది. ఎందుకంటే.. పానీపూరీ అమ్మే కుర్రాడు ఇంకో పూరీ ఇచ్చేలోపు తినాల‌న్న ఆత్రం ఉంటుంది.

అలాంటి హ‌డావుడి ఒక ప్రాణం పోవ‌టానికి కార‌ణ‌మైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన న‌రేష్ కుమార్ స‌చాన్ అనే వ్య‌క్తి  హ‌డావుడిగా పానీపూరీ తిన‌టంతో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

పానీపూరీ గొంతులో చిక్కుకుని శ్వాస‌నాళానికి అడ్డుప‌డింది. దీంతో.. శ్వాస తీసుకోవ‌టం క‌ష్టంగా మారి మృత్యువాత ప‌డ్డాడు. పానీపూరీ గొంతులో అడ్డుప‌డింది. అదే స‌మ‌యంలో పానీ పూరీలో ఉండే నీరు క‌డుపులోకి వెళ్లాల్సింది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయాయి.  దీంతో ప్రాణాలు పోయిన దుస్థితి.  

పానీపూరీని వేగంగా తినే ప్ర‌క్రియ‌లో భాగంగా ఇలాంటి ప‌రిస్థితి చోటు చేసుకుంటుంద‌ని.. అందుకే.. పానీ పూరీని తినేట‌ప్పుడు నెమ్మ‌దిగా తినాల‌ని.. అవ‌స‌ర‌మైతే షాపు వాడిని కాస్త నెమ్మ‌దిగా ఇవ్వమ‌ని కోరాలే త‌ప్ప హ‌డావుడి అస్స‌లు ప‌నికి రాద‌ని వైద్యులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు