చంద్రబాబు కంటే దేవాన్షే ధనవంతుడు

చంద్రబాబు కంటే దేవాన్షే ధనవంతుడు

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌ తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. లోకేశ్ ఇలా ఆస్తులను ప్రకటించడం ఇది మూడోసారి కాగా చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటించడం ఏడోసారి.  ఈ సందర్భంగా ఆయన తమ కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు హెరిటేజ్ సంస్థేనని చెప్పారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామని... హెరిటేజ్ సంస్థ టర్నోవర్ 2,600 కోట్ల రూపాయలని మంత్రి లోకేష్ ప్రకటించారు.

కాగా లోకేశ్ ప్రకటించిన ప్రకారం చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్ ఆస్తే ఎక్కువగా ఉంది.  తన తండ్రి చంద్రబాబు ఆస్తులు రూ.37లక్షల రూపాయలు కాగా, అప్పులు 3.58 కోట్ల రూపాయలని లోకేష్ వెల్లడించారు. దీంతోపాటు హైదరాబాద్ లో రూ.4 కోట్ల విలువైన ఇల్లుందన్నారు. ఇక తన ఆస్తుల విలువ 15.20 కోట్ల రూపాయలని చెప్పారు. తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్ల రూపాయలనీ, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల విలువ 11.54 కోట్ల రూపాయలనీ లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబునాయుడు సతీమణి, లోకేశ్ తల్లి అయిన భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.25 కోట్ల రూపాయలుగా వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఇల్లును కూల్చి కొత్తగా కట్టామని, ఇల్లు నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు వివరించారు. అది చంద్రబాబు పేరిట ఉన్న స్థిరాస్థిగా తెలిపారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ 30లక్షల రూపాయలు పెరిగిందన్నారు. మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ వస్తోందన్నారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తుల్లో ఎలాంటి మార్పులు లేవని మంత్రి పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English