మంత్రి కేటీఆర్‌కు తొమ్మిది త‌ర‌గ‌తి విద్యార్థి షాకింగ్ ట్వీట్‌

మంత్రి కేటీఆర్‌కు తొమ్మిది త‌ర‌గ‌తి విద్యార్థి షాకింగ్ ట్వీట్‌

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత చురుకుగా స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ల‌ను పంచుకోవ‌డం...త‌న కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను తెల‌ప‌డం అయినా... ప్రజా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అయినా...ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గానే కానిచ్చేస్తుంటారు. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే...కేటీఆర్ చేసే ట్వీట్ల ఆధారంగా స‌మ‌స్య‌ల‌పై స్పందించేందుకు ఓ పెద్ద వ్య‌వ‌స్థే ఉంది. స‌రే ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే...విద్యావ్యవస్థలోని పరిణామాలపై మంత్రి కేటీఆర్‌ మరోమారు స్పందించారు. గతంలో ఓ చిన్నారి రొట్టెముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ మరోమారు అదే రీతిలో స్పందించారు. ఈ ద‌ఫా ఏకంగా ప్ర‌ముఖ కార్పొరేట్ సంస్థ స్కూల్స్‌పై మంత్రి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. త‌మ విద్యాశాఖ మంత్రి, ఉప‌ముఖ్య‌మంత్రి అయిన క‌డియం శ్రీ‌హ‌రికి ఈ కంప్లైంట్ చేశారు.

మంత్రి కేటీఆర్ ఈ రేంజ్‌లో స్పందించేందుకు కార‌ణ‌మ‌యింది...టీఆర్ఎస్ పార్టీ నేత చేసిన ట్వీట్ లేదా మ‌రెవ‌రో వీఐపీ చేసిన ట్వీటో అనుకునేరు...అదేం కాదండి బాబు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి! షాక్ అవ‌కండి. నైన్త్ క్లాస్ విద్యార్థి ట్వీట్ చేయ‌డ‌మే కాదు...దానికి మంత్రి కేటీఆర్ కూడా అంతే సీరియ‌స్‌గా రియాక్ట‌వ‌డం డ‌బుల్ షాక్‌. ఇంత‌కీ ఆ విద్యార్థి ఏం ట్వీట్ చేశాడంటే...చదువుతో సతమతమవుతున్నాం...మా బాల్యాన్ని కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌లో మొర‌పెట్టుకున్నాడు.

అభిజిత్‌ కార్తిక్‌ అనే విద్యార్థి ‘సర్‌..నాపేరు అభి. కేపీహెచ్‌బీలోని టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్‌ టైమింగ్‌ ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. దీనికి తోడుగా ఐఐటీ తలనొప్పి ఒకటి. సోమవారం ఉన్న ఐఐటీ ఓరియంటేషన్‌ క్లాసులు మా ఆదివారం ఆనందాన్ని చంపేస్తోంది. మా బాల్యాన్ని కాపాడండి. దయచేసి కఠినంగా వ్యవహరించండి’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ బుడ్డోడి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ క‌దిలిపోయారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌...‘ఈ విషయంపై స్పందించడం చాలా కఠినమైన అశం అభి. ఈ స‌మ‌స్య‌ నన్ను బాధిస్తోంది. ఈ అంశాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిగారి దృష్టికి తీసుకువెళుతున్నాను. త్వరితగతిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను’ అని మంత్రి ట్వీట్‌ చేశారు. అంతేకాదు..అందులో ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రిని ట్యాగ్ కూడా చేశారు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు