సెలబ్రిటిలూ.. ఇది టూ మచ్

సెలబ్రిటిలూ.. ఇది టూ మచ్

హైద్రాబాద్ మెట్రో.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్. మెట్రో రైల్ లో ప్రయాణం కోసం జనాలు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నా.. కొత్త తరహా ప్రయాణ అనుభూతిని ఆస్వాదించేందుకు క్యూలు కట్టేస్తున్నారు. మెట్రో స్టేషన్స్ లో సండే రోజున ఎంతటి హంగామా కనిపించిందో చూశాం. మరీ ఇంత కాకపోయినా.. మిగిలిన రోజుల్లో కూడా డిమాండ్ బాగానే ఉంటోంది.

అయితే.. మెట్రోలో షికార్లు కొట్టి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేద్దామని భావిస్తున్న సెలబ్రిటీలకు మాత్రం.. ఇంతేసి జనాలు ఉండడం కంటగింపుగా ఉంది.. తెగ ఇబ్బంది అనిపించేస్తోంది. అందుకే మాస్కో మెట్రోతో పాటు మరికొన్ని ఫారిన్ మెట్రో రైళ్లలో రిలాక్సెడ్ గా జర్నీ చేస్తున్న జనాల ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మన మెట్రో ఇలా ఎప్పుడు ఉంటుంది అంటూ ట్వీట్ చేస్తున్నారు. నిజానికి ఇది చాలా ఓవర్ అనాలి.

వీళ్లకేదో ఇబ్బంది అయిపోతుందని వాళ్లే ఫీలవడమే కానీ.. అసలు మన జనాభా ఏంటి.. రష్యా జనాభా ఏంటి? అనే సంగతి పట్టడం లేదు. మన కల్చర్ లో కలుపుగోలుతనం ఎక్కువ. మాట్టాడుకోవడం ఎక్కువ. అక్కడేమో అవన్నీ తక్కువ. పుస్తకాలతో టైం స్పెండ్ చేస్తారు. పలకరింపులు చాలావరకూ కనిపించవు. మరి అలా ఎలా కంపేర్ చేస్తారన్నదే డౌట్.
 
అలా అయితే అన్నిటికీ పోలికలు పెట్టుకోవాలి కదా. అక్కడ బాడీ వార్మ్ గా ఉండాలని ఆడాళ్ళూ మగాళ్ళూ ఎక్కువగా వోడ్కా తాగుతూ ఉంటారు. మరి మనం కూడా హైదరాబాద్ లో అలాగే చేద్దామా? ఆల్రెడీ చలి బాగా పెరిగిందిగా అది కూడా బాగానే ఉంటుందని ఎంకరేజ్ చేద్దామా? బాబూ సెలబ్రిటిలూ.. ఈ దిక్కుమాలిన కంపేరిజన్స్ ఆపండ్రా నాయనా అనే కామెంట్స్ కు ఆన్సర్ వస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు