గాంధీ ఫ్యామిలీకి భారీ షాక్

గాంధీ ఫ్యామిలీకి భారీ షాక్

గాంధీ ఫ్యామిలీకి కంచుకోట‌గా అభివ‌ర్ణించే అమేథి నియోజ‌క‌వ‌ర్గంలో సంచ‌ల‌న ఫ‌లితం వెలువ‌డింది. గాంధీ ఫ్యామిలీకి వీర విధేయులుగా ఉండే అమేథి ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి.. గాంధీ ఫ్యామిలీకి భారీ షాక్ ఇచ్చారు. తాజాగా జ‌రిగిన అమేథి న‌గ‌ర పంచాయితీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభ‌వాన్ని మిగిల్చాయి.

అమేథి న‌గ‌ర పంచాయితీలో బీజేపీ చేత‌లి కాంగ్రెస్ ప‌రాజ‌యం పాలైంది. వెయ్యికి పైగా ఓట్ల‌తో కాంగ్రెస్ అభ్య‌ర్థిని మ‌ట్టి క‌రిపించారు బీజేపీ అభ్య‌ర్థి.  
ఏళ్ల‌కు ఏళ్లుగా అమేథి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ జెండానే ఎగురుతోంది. 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అమేథి లోక్ స‌భ నుంచి పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు పోటీగా కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేయ‌టం.. మొద‌టి రెండు మూడు రౌండ్ల‌లో రాహుల్ వెనుక‌బ‌డ‌టం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. త‌ర్వాత పుంజుకున్న రాహుల్ త‌న గెలుపును ఖ‌రారు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల జ‌రిగిన యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ అమేథి ప‌రిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల‌ను కాంగ్రెస్ కోల్పోయింది. అమేథీతో పాటు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ్ బ‌రేలీలోనూ బీజేపీ స్థానిక ఎన్నిక‌ల్లో పాగా వేసింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హా జోరును ప్ర‌ద‌ర్శించిన బీజేపీ.. తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టం ద్వారా యోగి స‌ర్కారు ఇమేజ్ ఏ మాత్రం చెక్కుచెద‌ర్లేద‌న్న సందేశాన్ని యూపీ ప్ర‌జ‌లు ఇచ్చిన‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు