ఆ హీరో బాత్‌రూం నుంచి డబ్బింగ్ చెప్పాడట

ఆ హీరో బాత్‌రూం నుంచి డబ్బింగ్ చెప్పాడట

తమిళ స్టార్ హీరో శిలంబరసన్ అలియాస్ శింబు మరోసారి పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. శింబు హీరోగా ‘అన్బనవన్ అసరాదవన్ అడంగాదవన్’ (ఏఏఏ) అనే సినిమా తీసిన నిర్మాత మైకేల్ రాయప్పన్ ప్రెస్ మీట్ పెట్టి అతడిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి శింబునే కారణమని.. అతను షూటింగ్ సందర్భంగా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని.. తమకు ఇచ్చిన డేట్లత పోలిస్తే... 35 శాతం మాత్రమే షూటింగుకి వచ్చాడని.. అందువల్లే ఆ సినిమా అతుకుల బొంతలా తయారైందని.. దీంతో ఫ్లాప్ అయిందని.. అతడి వల్ల తాను రోడ్డు మీదికి వచ్చానని.. శింబు నుంచి తనకు నష్టపరిహారం అందించాలని అతను డిమాండ్ చేశాడు. శింబు మీద ఇప్పటికే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన మైకేల్.. శింబు మీద చర్యలు తీసుకునే వరకు తాను విశ్రమించనని అన్నాడు.

‘ఏఏఏ’ సినిమాకు సంబంధించి శింబుకు డబ్బింగ్ థియేటర్ వరకు వచ్చి డబ్బింగ్ చెప్పేంత ఖాళీ కూడా లేకపోయింది. తన ఇంటి బాత్రూమ్‌లో కూర్చుని డైలాగులు రికార్డ్ చేసి ఆడియో ఫైల్ పంపాడని మైకేల్ ఆరోపించాడు. దాన్ని మిక్సింగ్ కోసం తీసుకెళ్తే క్వాలిటీ సరిపోలేదని.. అతి కష్టం మీద సౌండ్ క్వాలిటీ ఎన్‌హాన్స్ చేసి మిక్సింగ్ చేశామని మైకేల్ తెలిపాడు. శింబు వల్ల చాలా షూటింగ్ షెడ్యూళ్లు దెబ్బ తిన్నాయని.. హీరోయిన్లు తమన్నా, శ్రియల డేట్లు కూడా సగానికి సగం వృథా అయ్యాయని.. ఈ సినిమా కోసం ముందు అనుకున్నన్ని పాటలు కూడా తీయలేకపోయామని.. స్క్రిప్టులో ఉన్న చాలా సన్నివేశాలు సినిమాలో లేవని.. ఈ సినిమాలో శింబు చేసిన ఒక పాత్రకు సంబంధించి అతడి ఇంట్లోనే బతిమాలి షూటింగ్ చేశామని.. ఇలా అనేక రకాలుగా శింబు తమను ఇబ్బంది పెట్టాడని మైకేల్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో శింబు మీద తమిళ పరిశ్రమ నిషేధం విధించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు