ఇవాంకా పై వర్మ తూటాలు వేయలేదే?

ఇవాంకా పై వర్మ తూటాలు వేయలేదే?

రామ్ గోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్. ఒకప్పుడు కంటెంట్ తో సెన్సేషన్స్ సృష్టించిన ఈ దర్శకుడు.. ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టుల వరకే సంచనాలకు పరిమితం అయ్యాడు. రీసెంట్ గా అక్కినేని నాగార్జునతో మూవీ ప్రారంభించిన వర్మ.. తనలో ట్యాలెంట్ ఇంకా ఉందో అయిపోయిందో.. ఈ సినిమా తర్వాత తెలుస్తుందని ఛాలెంజ్ కూడా విసిరాడు.

అది ఓ యాంగిల్ అయితే.. మిడ్ నైట్ పోస్టుల విషయంలో వర్మకు బోలెడంత పేరు ఉంది. అర్ధరాత్రి వరకూ ఈయన పోస్ట్ ల కోసం ఎదురుచూసే వాళ్లు కూడా ఉంటారు. ఏదో ఒక కాన్సెప్ట్ ను పట్టుకుని.. ఎవరూ ఊహించని యాంగిల్ నుంచి కామెంట్స్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. కొన్ని రోజులుగా యూఎస్ ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక కు చురకలు వేస్తూ కామెంట్స్ చేసిన ఈయన.. ఆమెను ఏకంగా సన్నీ లియోన్ తో పోల్చాడు. కేసీఆర్ తో కూడా పోలికలు పెట్టాడు. ఇవి సెన్సేషన్ కాగా.. ఇవాంక ఇండియా టూర్ పై వర్మ ఏమంటాడనే ఆసక్తి నెలకొంది.

ఇవాంక రావడం.. మళ్లీ వెళ్లిపోవడం కూడా జరిగిపోయినా.. విచిత్రంగా వర్మ నుంచి రియాక్షన్ లేదు. దీనికి కారణం ఏంటబ్బా అని బోలెడంత డిస్కషన్స్ జరిగిపోతున్నాయి. కొందరు అయితే.. వర్మను కావాలనే నోరు మూయించారని.. ఒత్తిడి చేశారని అంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదు రామ్ గోపాల్ వర్మ. అదే పాయింట్ ను చెబుతోన్న మరికొందరు సోషల్ మీడియా జనాలు.. వర్మను హౌస్ అరెస్ట్ చేసి ఉంటారని.. కామెంట్స్ చేయకుండా బంధించి ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి వీటికి ఆన్సర్ మాత్రం.. మళ్లీ వర్మ నుంచి పోస్ట్ పడ్డాకే తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు