హైద‌రాబాదు మెట్రోలో ఫ్రీ జ‌ర్నీ చేస్తారా?

హైద‌రాబాదు మెట్రోలో ఫ్రీ జ‌ర్నీ చేస్తారా?

ఇదెలా సాధ్యం? న‌మ్మ‌శ‌క్యంగా లేదే. అలాంటి వార్త‌ను ఇప్ప‌టిదాకా విన‌లేదే అనుకుంటున్నారా? అవును.. మీరు ఇంత‌వ‌ర‌కు విన‌లేదు. కానీ ఇది నిజం. మీరు మెట్రోలో మీ జేబులో డ‌బ్బులు ఖ‌ర్చు కాకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఎలాంగ‌టారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

గ‌త ఏడాది ప్రారంభ‌మై అన‌తి కాలంలోనే మూడు బ్రాంచిలు ప్రారంభించి వేగంగా నోరూరించే రుచుల‌తో హైదరాబాదీల మ‌న‌సు దోచుకున్న అచ్చ తెలుగు రెస్టారెంట్ *తాలింపు*. ఈ రెస్టారెంట్ అన‌తి కాలంలోనే అచ్చ తెలుగు వంట‌ల‌తో పాటు పులావుల‌కు, బిర్యాల‌కు ప్ర‌సిద్ధి గాంచింది. *తాలింపు రెస్టారెంట్లో* మాత్ర‌మే దొరికే "పాల్వంచ బిర్యానీ" విశేషాద‌ర‌ణ పొందింది. *తాలింపు* పేరుతోనే చాలా మందిని ఆక‌ర్షించి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని రుచుల‌తో మెప్పించిన ఈ రెస్టారెంటు ఎవ‌రూ ఊహించ‌ని వినూత్న‌మైన‌ ఆఫ‌రుతో ముందుకు వ‌చ్చింది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా న‌వంబ‌రు 28న ప్రారంభ‌మైన మెట్రోలో మీరు ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశాన్ని ఈ రెస్టారెంటు క‌ల్పిస్తోంది. మీరు న‌గ‌రంలో మియాపూర్ లేదా నాగోల్ ఎటు వైపు నుంచి అయినా ప‌ర్లేదు మెట్రోలో ప్ర‌యాణించి మెట్రో స్టేష‌న్ల ప‌క్క‌నే (నిజాంపేట క్రాస్ రోడ్స్‌ లో స్టేష‌న్ ప‌క్క‌నే ఉంటుంది. అమీర్ పేట‌లో ఇమేజ్ హాస్ప‌ట‌ల్ రోడ్డులో స్టేష‌నుకి వాక‌బుల్ డిస్టెన్స్ లో ఉంటుంది) ఉండే తాలింపు రెస్టారెంటుకు వ‌చ్చి మీరు విందు ఆర‌గించండి. అనంత‌రం మీ బిల్లు లోంచి మీ మెట్రో టికెట్ ధ‌ర ఎంత‌యితే అంత డ‌బ్బును త‌గ్గించి బిల్లును చెల్లించండి. ఇందులో ఇక ఎలాంటి కండిష‌న్లు లేవు. ప్ర‌యాణం పూర్త‌యిన రెండు మూడు గంట‌ల్లోపు తాలింపున‌కు వ‌స్తేనే ఈ ఆఫ‌రు వ‌ర్తిస్తుంది. డిసెంబ‌రు 10 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ చెల్లుబాటు అవుతుంది.
స‌రదాగా ఓ సారి మెట్రో ప్ర‌యాణం చేద్దాం అనుకునే వారు ఎక్క‌డికో వెళ్ల‌డం ఎందుకు... అలా మెట్రో ఎక్కి అమీర్‌పేట్ లేదా నిజాంపేట‌లో దిగి తాలింపులో చ‌క్క‌టి విందును ఆస్వాదించండి. ఆ త‌ర్వాత మీ టికెట్ కౌంట‌రులో ఇవ్వండి. టికెట్ ధ‌ర‌ను డిస్కౌంట్ పొందండి. అంటే... మీ మెట్రో ప్ర‌యాణం ఉచితం. మీ స‌ర‌దాకి స‌ర‌దా... విందుకు విందు. ఒక్క దెబ్బ‌కి రెండు పిట్ట‌లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు