మోడీని చూసి నేర్చుకోండమ్మా

మోడీని చూసి నేర్చుకోండమ్మా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సక్సెస్ఫుల్ లీడరా కాదా అనే విషయం పక్కనెట్టేస్తే.. ఆయన ప్రధాన మంత్రి కావడానికి చూపించిన దక్షత.. ప్రధాన అయిన తరువాత ఆయనకు ఆంగ్లం సరిగా రాదు అని అవహేళన చేసినవారికి ఆయన ఇస్తున్న ఆన్సర్లు.. అదిరిపోయాయ్ అంతే. ముఖ్యంగా #GES2017లో ఆయన ఇచ్చిన ఇంగ్లీష్‌ స్పీచ్ అదిరిపోయింది. దాని గురించి ఎన్నిసార్లైనా చెప్పుకోవాల్సిందే.

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సమ్మిట్ లో ప్రధాన మంత్రి మోడి తన ఇంగ్లీష్‌ ప్రసంగంతో అదరగొట్టశారు. మోడీ కంటే గొప్ప చదువులు చదివిన సుష్మా స్వరాజ్ వంటి నాయకులు కూడా స్లిప్ పెట్టకుండా స్పీచ్ ఇవ్వలేని పరస్థితి ఉన్న వేళ.. మోడీ మాత్రం సింపుల్ గా ఎటూ చూడకుండా.. అక్కడకు వచ్చిన పార్టిసిపెంట్లతో నేరుగా మాట్లాడుతూ దంచేశారు. అంతే కాకుండా.. తన ప్రసంగంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నింటి గురించి చెప్పేశారు. పైగా హైదరాబాద్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ నగరానికి చెందిన సైనా నెహ్వాల్.. పివి సింధు.. మరియు సానియా మీర్జాలు.. దేశానికే పేరుతెచ్చారంటూ కొనియాడారు. హైదరాబాద్ ను.. ఆంగ్లాన్ని.. రెండింటినీ టాప్ క్లాస్ లో ప్రెజెంట్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు ప్రధాన మంత్రి మోడి.

అంతేకాకుండా.. తన ప్రసంగం చివర్లో.. ఇన్వెస్టర్లే వ్యాపారవేత్తలు ఇండియాకు రావాలని.. ఇండియా అభివృద్ది పేజీల్లో భాగస్వామ్యం తీసుకోవాలని కోరడంతో.. ఒక్కసారిగా అందరూ లేచి నుంచొని చప్పట్లు కొట్టారు. మొత్తానికి ఒక ఈవెంట్లో స్పీచ్ ఎలా ఇవ్వాలి.. అందరినీ ఎలా ఆకట్టుకోవాలి.. తమ వీక్నెస్ ను ఎలా ఒక స్ర్టెంగ్త్ తరహాలో చేసుకోవాలి అనేది మోడీని చూసి చాలామంది రాజకీయ నాయకులు నేర్చుకోవాలమ్మా!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు