చరణ్ కు పిలుపొచ్చింది.. కానీ..

చరణ్ కు పిలుపొచ్చింది.. కానీ..

హైదరాబాద్ లో జరగబోయే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ రానుందని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ ప్రోగ్రాంపై ఫోకస్ అంతా విపరీతంగా పెరిగింది. దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్న కార్యక్రమం కావడంతో దీనికి ఆహ్వానం లభించడమే అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఈవెంట్లో హైదరాబాద్ ఘనతగా చెప్పుకొనే టాలీవుడ్ పేరు కూడా వినిపించట్లేదు.

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది స్వయంగా సెంట్రల్ గవర్నమెంట్ కావడంతో ఎవరిని ఆహ్వానించాలి అనేది ఢిల్లీ పెద్దలే నిర్ణయిస్తున్నారు. అన్నిదేశాలకు చెందిన పెద్దలు వస్తున్నందున ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిన వారికే ఆహ్వానం ఉంటుందని అంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. అదితిరావు హైదరీలకు ఇన్విటేషన్ అందిందని తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కు ఇన్విటేషన్ వచ్చేలా చేయాలని ప్రయత్నిస్తున్న తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ రామమోహనరావు చెబుతున్నారు. టాలీవుడ్ కు చెందిన వారిలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు.. రామ్ చరణ్ లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో సురేష్ బాబు పేరు ఇండస్ట్రీ తరఫున కాకుండా బిజినెన్ ఇన్వెస్టర్స్ క్లబ్ నుంచి వెళ్లింది. యంగెస్ట్ ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ హాజరై సినీ పరిశ్రమ ఫ్యూచర్ గురించి మాట్లాడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

షారూక్ ఖాన్ ను ఈ సమ్మిట్ కు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించిపప్పటికీ ఈ ప్రోగ్రాంకు వచ్చేదీ లేనిదీ ఇంకా అతడివైపు నుంచి క్లారిఫికేషన్ రాలేదు. షారూక్ ప్రధాని మోడీ ఇచ్చే విందులో పాల్గొంటాడా.. లేక ఇవాంకా ట్రంప్ కోసం ఏర్పాటు చేసే ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాడా అన్నదానిపై క్లారిటీ రాలేదు. మొత్తానికి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇవాంకా తళుకులే మిలమిల మెరుస్తుంటే ఇంక తారల తళుకులెందుకని అనుకున్నారో ఏంటో సమ్మిట్ నిర్వాహకులు.

అయితే ఈ కార్యక్రమానికి లోకల్ లీడర్లు మాత్రం వెళ్లే ఛాన్సు కాని.. పిలిచే ఛాన్సు కాని లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కార్యక్రమంలో 'నో ప్రోటోకాల్' అంటూ ఆదేశాలు జారీ చేసిందట. అంటే హైదరాబాద్ సిటీ మేయర్ ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచే అవకాశం లేదన్నమాట. ఈ సమయంలో మరి తెలంగాణ మంత్రి కెటిఆర్ తన స్నేహితుడు రామ్ చరణ్‌ ను పిలుస్తాడా? తీసుకెళ్తాడా? వెయిట్ అండ్ సి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు