మెట్రో టైన్లో కింద కూర్చుంటే ఫైన్‌!

మెట్రో టైన్లో కింద కూర్చుంటే ఫైన్‌!

విన‌టానికి వింత‌గా ఉన్నా ఇది నిజం. విశేషాల పుట్ట‌గా చెప్పే హైద‌రాబాద్ మెట్రో రైలుకు మ‌రో మూడు రోజుల్లో ప‌ట్టాల మీద‌కు రానుంది. ఈ వేళ‌లో ఈ రైలుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ ట్రైన్లో ప్ర‌యాణించే వారు పొర‌పాటున సీటులో కూర్చుకోకుండా కింద కూర్చుంటే జ‌రిమానా త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. తోటి ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

హైద‌రాబాద్ మెట్రో రైల్ మూడు బోగీల్లో ఉండ‌నుంది. ఒక్కొ ట్రిప్ లో వెయ్యి మంది ప్ర‌యాణికుల్ని తీసుకెళ్లే సామ‌ర్థ్యం ఉంటుంది. ప్ర‌తి ప‌దిహేను నిమిషాల‌కు ఒక‌సారి న‌డిచే ఈ రైలు లోప‌ల డిజైన్ చూస్తే కూర్చునేందుకు సీట్లు ప‌రిమితంగా క‌నిపిస్తాయి. నిల‌బ‌డేందుకు ఎక్కువ అవ‌కాశం ఉన్న ఈ రైల్లో కింద కూర్చోకూడ‌ద‌ని చెబుతున్నారు.

ఒక‌వేళ కూర్చుంటే వారికి జ‌రిమానా విధిస్తారు. అంతేకాదు.. హైద‌రాబాద్ మెట్రోరైలుకు సంబంధించి జ‌రిమానాల లిస్ట్  ఎక్కువ‌గానే ఉంద‌ని చెబుతున్నారు.

ట్రైన్ టికెట్ తీసుకున్న త‌ర్వాత 29 నిమిషాల వ‌ర‌కూ ఎలాంటి ఇబ్బంది లేద‌ని.. ఆ త‌ర్వాత ప్ర‌తి నిమిషానికి రూపాయి చొప్పున (అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.. దాదాపుగా రూపాయి కానీ రెండు రూపాయిలు కానీ ఉండొచ్చు) ఫైన్ విధిస్తార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. టికెన్ కొనుగోలు చేసిన అర‌గంట వ్య‌వ‌ధిలో ఫ్లాట్ ఫాం మీద‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఫ్లాట్ ఫాం మీద‌కు వెళ్లిన త‌ర్వాత రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో గ‌మ్య‌స్థానానికి చేరాల్సి ఉంటుంది. ఒక‌వేళ రెండు గంట‌ల్లో త‌న ప్ర‌యాణాన్ని ముగించ‌ని ప‌క్షంలో  నిమిషానికి ఇంత‌ని చొప్పున ఫైన్ వేసేస్తారు.

ఇదే కాదు.. ల‌గేజ్ విష‌యంలో ఆంక్ష‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ మెట్రో ట్రైన్లో ప్ర‌యాణించే ఎవ‌రైనా స‌రే 10 కిలోల ల‌గేజ్ వ‌ర‌కు ఉచితంగా అనుమ‌తిస్తారు. ఆ త‌ర్వాత ప్ర‌తి కేజీకి రూపాయి చొప్పున (అధికారికంగా వెల్ల‌డించ‌లేదు కానీ.. దాదాపుగా ఇంతే ఉండొచ్చ‌ని తెలుస్తోంది)  ఫైన్ విధిస్తారట‌. ఒక‌వేళ ప్ర‌యాణికుడి ల‌గేజ్ 40 కేజీలు దాటితే స్టేషన్లోకి అనుమ‌తించ‌ర‌ని చెబుతున్నారు. ప్ర‌యాణికుడు తెచ్చే ల‌గేజ్ ఎంత బ‌రువ‌న్న‌ది ఎలా తేలుస్తార‌న్న డౌట్ రావొచ్చు.. దీనికి ఒక ఏర్పాటు చేశారు. ప్ర‌తి స్టేష‌న్లోనూ రెండు వేయింగ్ మెషిన్ల‌ను ఏర్పాటు చేశారు. ల‌గేజ్ తీసుకెళుతున్న ప్ర‌యాణికుల మీద డౌట్ వ‌స్తే  వారి ట‌గేజ్ వెయిట్ చూస్తారు. ప‌రిమితికి మించి ల‌గేజ్ ఉంటే వారికి ఫైన్ వేస్తారని చెబుతున్నారు. ఇలా ఫైన్ల మీద ఫైన్లు వేసేందుకు హైద‌రాబాద్ మెట్రో రైల్ రెఢీ అవుతోంద‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English