ముస్లింల‌పై ముస్లిం ఉగ్ర‌వాదుల దాడి...184 మంది మృతి

ముస్లింల‌పై ముస్లిం ఉగ్ర‌వాదుల దాడి...184 మంది మృతి

ఆశ్చ‌ర్య‌క‌రం అయిన‌ప్ప‌టికీ...విస్మ‌య‌క‌ర‌మైన నిజ‌మిది. ముస్లిం మ‌త‌స్థుల విశ్వాసాన్ని గౌర‌వించే ఈజిప్టులో మసీదుపై దాడి జ‌రిగింది. ఇది ఆశ్చర్యక‌ర‌మే అయిన‌ప్ప‌టికీ...నిజం. ముస్లింల దేశంలో మసీదుపై దాడి జరగడం చాలా అరుదు. కానీ అదే జ‌రిగింది. అల్ అరిష్ లోని ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనలను టార్గెట్ చేస్తూ అనుమానిత ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నాలుగు వాహనాల్లో వచ్చిన కొందరు ఉగ్రవాదులు మసీదుపై బాంబులతో దాడి చేశారు. దీంతో భయంతో బయటకు పరుగు పెడుతున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 184 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ భ‌యానక దాడి కార‌ణంగా....మృతదేహాలు మాంసపు మద్దుల్లా చెల్లాచెదురుగా పడిపోయాయి. మసీదులో ఎటు చూసినా రక్తపుటేరులే. ఘటనాస్థలికి చేరుకున్న అక్కడి భద్రతా సిబ్బంది.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 184 మంది చనిపోయినట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్హా కైరోలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. సినాయ్‌లో జరిగిన ఉగ్రదాడిపై సమీక్షించారు. ఉగ్రదాడి నేపథ్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా ఈజిప్టు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా, ఈజిప్ట్‌లో ఉగ్ర‌వాదుల తీరు భిన్నంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎక్కువగా కాప్టిక్ క్రిస్టియన్ చర్చిలనే టార్గెట్ చేస్తారు. క్రిస్టియన్లతో పాటు భద్రతా దళాలను హతమార్చడమే ఇక్కడి ఇస్లామిక్ స్టేట్ పని. కానీ దానికి భిన్నంగా బిల్ అర్ అబ్ద్ మసీదులో దాడి జరిగింది. ఈ సంఘటన యావత్ ముస్లిం దేశాలను నివ్వరపరిచింది. ఈజిప్టు ప్రజలు కూడా తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఉగ్రవాదులు ప్రత్యేకంగా సూఫీ ముస్లింలను టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. భారీ వాహనంలో మసీదుకు వచ్చిన దుండగలు.. మసీదులో బాంబులు పేల్చారు. అక్కడ నుంచి పారిపోతున్న వారిని గన్నులతో కాల్చేశారు. మసీదు దాడిలో ఓ సూసైడ్ బాంబర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ దాడి వెనుక మ‌త‌ప‌ర‌మైన అంశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సూఫీ ముస్లింలు ఇస్లాం మతంలో ప్రత్యేకమైనవాళ్లు. సాంప్రదాయ ముస్లింలు, సున్నీ తీవ్రవాదులు...సూఫీ ముస్లింలను మత విరోధులగా భావిస్తారు. బిర్ అల్ అబ్ద్ ప్రాంతంలో ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అనేక మంది సూఫీలను చంపేశారు. కానీ గతంలో వాళ్లు ఎప్పుడూ ఓ మసీదును టార్గెట్ చేయలేదు. అయితే ఈ సారి మసీదులోనే సూఫీ ముస్లింలను హతమార్చడం ఇస్లామిక్ స్టేట్ వికృతత్వాన్ని బయటపెడుతోంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు