శ్రీశాంత్‌కీ టాలీవుడ్‌కీ లింకు

శ్రీశాంత్‌కీ టాలీవుడ్‌కీ లింకు

స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డ క్రికెటర్‌ శ్రీశాంత్‌కీ తెలుగు సినీ పరిశ్రమకూ లింకులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్‌తో శ్రీశాంత్‌ కనెక్షన్‌ని గుర్తించిన పోలీసులు, తెలుగు సినిమా పరిశ్రమకు ఆశ్చర్యం గొలిపే వాస్తవాలు వెల్లడించినట్లుగా తెలుస్తున్నది.

ఓ తెలుగు సినిమా నిర్మాతతో శ్రీశాంత్‌కి సంబంధాలున్నాయని వినికిడి. ఆ నిర్మాతను రెండ్రోజుల్లో పోలీసులు విచారించనున్నారంట. ఓ 'కాస్టింగ్‌ కంపెనీ'లో శ్రీశాంత్‌కి భాగస్వామ్యం ఉంది. కమర్షియల్‌ యాడ్స్‌ రూపొందించడానికి శ్రీశాంత్‌ ప్రయత్నించాడని, ఓ సినిమా నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడనీ పోలీసులు గుర్తించారంట.

శ్రీశాంత్‌ అరెస్టు అనంతరం ఆయన ల్యాప్‌ టాప్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులకు, అందులో దొరికిన మోడల్స్‌ ఫొటోలతో షాక్‌ తగిలింది. తీగ లాగితే హైద్రాబాదులో డొంక కదిలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు