కేసీఆర్‌ను మెచ్చుకొని..బాబు, లోకేష్‌ను వాయించిన పోసాని

కేసీఆర్‌ను మెచ్చుకొని..బాబు, లోకేష్‌ను వాయించిన పోసాని

ఏపీలో నంది అవార్డులు సృష్టించిన ర‌చ్చ ఇంకా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు అవార్డుల తీరును త‌ప్పుప‌ట్టగా...ఏపీలో ఆధార్ కార్డ్ లేని వారు సైతం స్పందించ‌డం ఏంట‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, మంత్రి లోకేష్ కామెంట్ చేయ‌డం ఈ వేడిని మ‌రింత పెంచింది. ఈ నేపథ్యంలో  ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఈ అవార్డుల తీరుపై స్పందిస్తూ నంది అవార్డులు కాకుండా లోకేష్ బాబు అవార్డుల‌ని పేరు పెట్టుకోవాల‌ని ఎద్దేవా చేశారు.

ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించడంపై పోసాని మండిపడ్డారు. ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా..విమర్శించకూడదా..? అని పోసాని మంత్రి లోకేశ్ ను ప్రశ్నించారు. `లోకేశ్..చదువుకున్నావా..బుద్ది, జ్ఞానం సంస్కారంతో మాట్లాడుతున్నావా..మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టడం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా.? మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు?` అని పోసాని ప్రశ్నించారు. `నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండి ఉంటే నాశనం అయ్యే వాళ్లం. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా ? గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా..? అపుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌లోకల్ అన్నారా ? నంది అవార్డులను విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా..?` అని పోసాని ప్రశ్నించారు.

నంది అవార్డుల విషయంలో లోకేష్, బాబు ప్రకటన విన్నాక తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్లో అర్థమవుతోంద‌ని పోసాని వ్యాఖ్యానించారు. `నంది విషయంలో విమర్శించినంత మాత్రాన మేం నాన్ రెసిడెంట్ ఆంధ్రానా..? తెలంగాణలో బతికి తెలంగాణ గడ్డను రాజకీయం చేసింది ఆంధ్రా నాయకులు కాదా..?` పోసాని ప్రశ్నించారు.మర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి..వాళ్లకు కూడా హైదరాబాద్‌లోనే ఆధార్ కార్డులున్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్‌లు కడుతున్నారు కదా.. మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారని పోసాని ప్రశ్నించారు. తనకు టెంపర్ సినిమాకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని చెప్పారు. ఈ అవార్డు అందుకోవడానికి తాను సిగ్గుపడుతున్నానని పోపాని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు