అక్కడ బన్నీ పెట్టిన తొలి ఫొటో ఏదంటే..

అక్కడ బన్నీ పెట్టిన తొలి ఫొటో ఏదంటే..

ఫేస్‌బుక్‌ షేక్ చేసి.. ట్విట్టర్‌లో అదరగొట్టి.. ఇప్పుడు మరో సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా వచ్చేశాడు అల్లు అర్జున్. ముందుగా పెట్టిన ముహూర్తం ప్రకారమే ఈ రోజు ఉదయం ఇన్‌స్టా‌గ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక్కడ బన్నీ అకౌంట్ కొన్ని రోజుల కిందటే లాంఛనంగా ఆరంభమైనప్పటికీ.. బన్నీ తొలి పోస్ట్ ఏదీ పెట్టకపోవడంతో అది ఇన్‌యాక్టివ్‌గానే ఉంది.

 ఐతే మంగళవారం తన ముద్దుల కూతురు అల్లు అర్హ తొలి పుట్టిన రోజును పురస్కరించుకుని బన్నీ ఇన్‌స్టా‌గ్రామ్‌లో తొలి ఫొటో షేర్ చేశాడు. అర్హ పుట్టిన రోజు కాబట్టి ఆమె ఫొటోనే బన్నీ ఇన్‌స్టా‌గ్రామ్‌లో షేర్ చేశాడు. కేక్ ముందు ముద్దులొలుకుతూ కూర్చున్న అర్హ ఫొటో అది.

తాను షేర్ చేయబోయే ఫొటో చాలా స్పెషల్ అని.. మెమొరబుల్ అని బన్నీ ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘నా లిటిల్ ఏంజెల్‌కు హ్యాపీ బర్త్ డే. అప్పుడూ ఒక ఏడాది అయిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఉమ్మా..’’ అని బన్నీ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే ఇది వైరల్ అయిపోయింది. వేలల్లో లైక్స్ వచ్చాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో కూడా ఈ ఫొటోను అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. ‌ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి ఫొటో పెట్టడానికంటే ముందే బన్నీకి లక్ష మందికి పైగా ఫాలోవర్లు తయారవడం విశేషం. ప్రస్తుతం అతడిని 1.3 లక్షల మంది దాకా అనుసరిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 1.27 కోట్ల మంది.. ట్విట్టర్లో 17 లక్షల మంది ఫాలోవర్లు బన్నీ వెనుక ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English