నాసా అంచనా... భూమి అంతం 2036

నాసా అంచనా... భూమి అంతం 2036

చూస్తుంటే..భూమి అంతం విష‌యంలో ఇన్నాళ్ల గాలి కబుర్లు నిజ‌మ‌య్యేలాగానే క‌నిపిస్తోంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు అది ద‌గ్గ‌ర్లోనే ఉంద‌ని తెలుస్తోంది. నిబిరు అనే ఓ గ్రహం మనవైపు దూసుకొస్తోంద‌ని, రేపోమాపో భూమి ఇక అంతమవుతుందని కొన్ని రోజులుగా కాన్‌స్పిరసీ థియరిస్టులు లెక్కలేస్తున్న విషయం తెలిసిందే కదా. ఓ తేదీ చెప్పడం అది దాటితే మరో తేదీ.. ఇలా వీళ్ల సిద్ధాంతాలు, అంచనాలకు విలువు లేకుండా పోయింది. తద్వారా భూమి అంతం అనేది ఓ కామెడీ విష‌యం అయిపోయింది. ఇప్పటికే డేవిడ్ మీడ్‌లాంటి కాన్‌స్పిరసీ థియరిస్టులు అక్టోబర్ 15, నవంబర్ 19లలో నిబిరు అనే గ్రహం ఢీకొని భూమి అంతమవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. కానీ అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో పేరెన్నిక‌గ‌న్న నాసా ఇప్పుడు ఈ భ‌యాన్ని నిజం చేస్తోంది.

స‌ద‌రు థియ‌రిస్టుల వ‌లే...నాసా కూడా భూమి అంతాన్ని ఊహించింది. ఇప్పుడు కాదుగానీ.. 2036లో ఓ ఆస్టరాయిడ్ ఢీకొని భూమి అంతమవుతుందని నాసా అంచనా వేస్తోంది. అపోఫిస్ అనే ఆ ఉల్క.. భూమిని బలంగా ఢీకొనడంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉన్నట్లు సాక్షాత్తూ నాసానే చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. 2004లో నాసా ఈ ఉల్కను కనుగొంది. 13 ఏళ్లుగా దీనిని పరిశీలిస్తూనే ఉంది. తాజాగా దాని కదలికలను చూసిన తర్వాత 2036లో అది భూమిని ఢీకొంటుందని నాసా ఓ అంచనాకు వచ్చింది. ఐబీ టైమ్స్ అనే పత్రికలో ఈ కథనం వచ్చింది. నాసా అధికారి డునె బ్రౌన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా!

నాసా ప్రొపల్షన్ లేబొరేటరీలోని సైంటిస్టులు స్టీవ్ చెల్సీ, పాల్ ఖొడాస్ 2009 నుంచి ఈ ఉల్క గమనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కచ్చితంగా చెప్పాలంటే ఇది 2036, ఏప్రిల్ 13న భూమిని ఢీకొంటుందని వీళ్లు చెబుతున్నారు. అపోఫిస్ అనే ఈ ఉల్క చాలా ఆందోళన కలిగిస్తున్నదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంప్యుటేషనల్ టెక్నిక్స్, డేటాను విశ్లేసిస్తే అది 2036, ఏప్రిల్ 13న భూమిని ఢీకొంటుందని నాసా తన వెబ్‌సైట్‌లో రాసుకున్నట్లు ఐబీ టైమ్స్ పత్రిక వివరించింది. అంతకుముందే అంటే 2029లోనూ అపోఫిస్ ఒకసారి భూమికి సమీపంగా రానుంది. భూమికి కేవలం 32 వేల కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్తుందని రష్యా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో దాని దారిలో కొద్దిపాటి తేడా వచ్చినా అది భూమిని అంతం చేస్తుందని వీళ్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు