'ఇవాంకాను వ‌దిలిపెట్ట‌ని వ‌ర్మ‌

'ఇవాంకాను వ‌దిలిపెట్ట‌ని వ‌ర్మ‌

నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడే వారు ప్ర‌తి చోటా క‌నిపిస్తుంటారు. కానీ.. ప్ర‌ముఖులుగా కీర్తించే వారిలో అలాంటోళ్లు క‌నిపించరు. కానీ.. ఆ కొర‌త తీర్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు  సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. త‌న‌కు సంబంధం ఉన్నా.. లేకున్నా ప్ర‌తి విష‌యం మీదా ఏదో ఒక రీతిలోరియాక్ట్ అవుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు.

వ‌ర్మ చేసే ప్ర‌తి పోస్ట్ లోనూ ఏదో ఒక వివాదం ఉండ‌టం.. ఎంతోకొంత మంది మ‌న‌సులు గాయ‌ప‌డ‌టం మామూలైంది. ప్ర‌తి విష‌యాన్ని ఎట‌కారం చేసుకునే త‌త్త్వం.. చుల‌క‌న చేసి మాట్లాడ‌టం ఈ మ‌ధ్య‌న వ‌ర్మ‌కు అల‌వాటుగా మారింది. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. నా ఇష్టం.. నాకు న‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌తా?  మీ ఫీలింగ్ మీది.. నా ఫీలింగ్ నాదని అడ్డ‌గోలుగా స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.

త‌న‌కు అవ‌గాహ‌న లేదంటూనే  వివాదాస్ప‌ద వ్యాఖ్య చేసిన వ‌ర్మ‌.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ను కూడా వ‌ద‌ల్లేదు.  త‌న‌కు రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న లేద‌న్న ఆయ‌న‌.. ఇవాంకా హైద‌రాబాద్ ఎందుకు వ‌స్తున్నారో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌న్నారు. తాను మాత్రం ఆమె అందాన్ని చూడాల‌ని ఎంత‌గానో ఎదురు చూస్తున్న‌ట్లుగా చెప్పారు.

గ‌తంలో స‌న్నీ లియోని భార‌త్‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా తాను ఇదే రీతిలో చాలా థ్రిల్ల‌య్యాన‌ని.. ఇవాంకా రావ‌టాన్ని కూడా తాను ఇదే రీతిలో ఫీల‌వుతున్న‌ట్లుగా వెల్ల‌డించారు వ‌ర్మ‌.  ఈ నెల 28న జీఈఎస్ కోసం హైద‌రాబాద్ రానున్న ఆమె మూడు రోజులు ఉండ‌నున్నారు. ఇందుకోసం హైద‌రాబాద్ న‌గ‌రాన్ని భారీగా ముస్తాము చేస్తున్నారు. ఇవాంకా కోసం ప్ర‌ధాని మోడీ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో ప్ర‌త్యేక విందును ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం గోల్కొండ‌లో ప్ర‌త్యేక విందును ఇస్తోంది. ఇవాంకా రాక‌ను అంద‌రు చూస్తున్న కోణానికి భిన్నంగా వ‌ర్మ చూస్తున్న కోణం ఆశ్చ‌ర్యంగా అనిపించ‌ట‌మే కాదు.. ఇలాంటివి వ‌ర్మ లాంటి వారికి మాత్ర‌మే చెల్లుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు