ఆ జ‌వాబు.. మామూల‌మ్మాయ్ ని మిస్ వ‌రల్డ్ చేసింది

ఆ జ‌వాబు.. మామూల‌మ్మాయ్ ని మిస్ వ‌రల్డ్ చేసింది

అందం ఉంటేనే మిస్ వ‌రల్డ్ అయిపోరు. అందుకు స‌మ‌య‌స్ఫూర్తి.. మ‌న‌సుల్ని దోచుకునే మాట చాలా చాలా ముఖ్యం. ప్ర‌శ్న ఎలాంటిదైనా.. స‌మాధానం గుండెల్ని ట‌చ్ చేసేలా ఉండాలి. అందుకు త‌గ్గ‌ట్లుగా స‌మాధానాన్ని సిద్ధం చేసుకోవాలి. అది కూడా క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే. అంత‌టి స్పాంటేనియ‌స్ ఉంటేనే మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్కేది.

హ‌ర్యానా చిన్న‌ది మానుషీ చిల్లర్ ఇప్పుడు మామూలు అమ్మాయి కాదు. మిస్ వ‌ర‌ల్డ్‌. నిన్న ఉద‌యం వ‌ర‌కు కూడా ఆ అమ్మాయికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు లేదు. కానీ.. ఆమె చెప్పిన ఒకే ఒక్క స‌మాధానం ఆమెను విజేత‌గా మార్చ‌ట‌మే కాదు.. ప్ర‌పంచం మొత్తం ఆమెను చూసేలా చేసింది.

మిస్ వ‌ర‌ల్డ్ పోటీల్లో భాగంగా న్యాయ‌నిర్ణేత‌లు అడిగిన ప్ర‌శ్న‌కు మానుషీ చిల్లర్  చెప్పిన స‌మాధానం ఆమెను విజేత‌గా మార్చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే మానుషీ చెప్పిన స‌మాధానం న్యాయ‌నిర్ణేత‌ల్ని మాత్ర‌మే కాదు.. ఆ పోటీకిహాజ‌రైన స‌భికులంద‌రిని ట‌చ్ చేసేలా ఉండ‌టం.

 ప్ర‌పంచంలో అత్య‌ధిక వేత‌నం ఇవ్వాల్సిన వృత్తి ఏదని మీరు అనుకుంటున్నారు? అంటూ న్యాయ‌నిర్ణేత‌లు మానుషీ చిల్ల‌ర్ ను ప్ర‌శ్నించారు. ఆమె దానికి చెప్పిన స‌మాధానం ఏమిటంటే.. జీవిత‌మంటే కేవ‌లం డ‌బ్బు కాద‌నే నేను అనుకుంటున్నా. ప్రేమ‌.. గౌర‌వం.. వీటికి మించిన జీతం ఏముంటుంది?  చిన్న‌త‌నం నుంచి అమ్మే నాకు స్ఫూర్తి. ఆ ర‌కంగా చూస్తే అమ్మ‌త‌న‌మే ఈ ప్ర‌పంచం అత్య‌ధిక జీతం అందించాల్సిన ప‌ని అంటూ స‌మాధానం చెప్పేసింది. అదే.. మామూల‌మ్మాయ్ గా ఉన్న ఆమెను మిస్ వ‌ర‌ల్డ్ గా మార్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు