సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో చోరీ

హైద‌రాబాద్‌లో మ‌రో భారీ చోరి క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఈ ద‌ఫా ప్ర‌ముఖుడు అందులోనూ పోలీస్ ముఖ్యుడి నివాసంలోనే దొంగ‌త‌నం జ‌రిగింది. బంజారాహిల్స్‌లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లో చోరీ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులకు లక్ష్మీనారాయణ సతీమణి ఫిర్యాదు చేసింది. 20 తులాల బంగారం చోరీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ల‌క్ష్మీనారాయ‌ణ కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, లక్ష్మీనారాయణ ప్రస్తుతం ముంబైలో అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఈ కేసుకు సంబందించి పూర్తి వివ‌రాలు పోలీసులు అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు