ఏపీ సీఎంకు టీఆర్ ఎస్ ఎంపీ ఆహ్వానం

ఏపీ సీఎంకు టీఆర్ ఎస్ ఎంపీ ఆహ్వానం

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు అనుకోని అతిథి నుంచి ఆహ్వానం అందింది. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల‌లో వివాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ‌ల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల ఇళ్ల‌లో పెళ్లి బాజాలు మోగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు చెందిన ఎంపీ నుంచి సీఎం చంద్ర‌బాబుకు వివాహ ఆహ్వాన ప‌త్రిక అందింది.

టీఆర్ఎస్ నేత‌, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు జితేందర్‌రెడ్డి శుక్ర‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య రాజ‌ధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని క‌లిసి కాసేపు మాట్లాడారు. తన కుమారుడి పెళ్లికి రావాలని చంద్రబాబును ఆహ్వానించి, శుభలేఖ అందించారు. ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడి వివాహం త్వ‌ర‌లోనే జ‌రగ‌నున్న‌ట్లు  తెలిసింది. దీనికి స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా రావాలంటూ.. జితేంద‌ర్ రెడ్డి బాబును ఆహ్వానించారు.

అయితే, అదేస‌మ‌యంలో ఏపీలోని చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధుల ఇళ్ల‌లోనూ వివాహాలు ఉండ‌డంతో బాబు ఎంత మేర‌కు జితేంద‌ర్ రెడ్డి వివాహానికి వెళ్తార‌నేది సందేహంగానే ఉంది. అయితే, టీఆర్ ఎస్‌కు చెందిన ఎంపీ.. ఇలా ఏపీ సీఎం బాబుకు ఆహ్వానం అందించ‌డంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్ర‌బాబు ఈ ఆహ్వానంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు