లగడపాటిని అక్కున చేర్చుకున్న తెలంగాణ

లగడపాటిని అక్కున చేర్చుకున్న తెలంగాణ

ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ తెలుగు రాష్ర్టాల్లో త‌న హ‌ల్ చ‌ల్ కొన‌సాగిస్తున్నారు. తన కుమారుడి వివాహం సంద‌ర్భంగా ఆహ్వానం అందించేందుకు ప‌లువురు నేత‌ల‌ను క‌లుస్తున్న ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ ఈ క్ర‌మంలో మొద‌ట ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. అనంత‌రం ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డితో స‌మావేశం అయి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు.  

దీనికి కొనసాగింపు అన్న‌ట్లుగా తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌ను ముఖ్య‌మంత్రి నివాసమైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోనే క‌లిసి సంచ‌ల‌నం సృష్టించారు. తెలంగాణ ఉద్య‌మంలో ఉప్పునిప్పుగా ఉన్న నాయ‌కుడిని క‌ల‌వ‌డం ఏమిట‌ని ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇంకొంద‌రు నొచ్చుకున్నారు. అయితే ఇలాంటి కామెంట్ల‌ను కేసీఆర్ టేకిట్ ఈజీగా తీసుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే.

తాజాగా తెలంగాణ శాస‌నమండ‌లిలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హ‌ల్ చ‌ల్ చేశారు. తెలంగాణ శాసన మండలికి వచ్చిన ల‌గ‌డ‌పాటి మండలి వద్ద ఎమ్మెల్సీలను కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలని వారిని రాజగోపాల్‌ ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఎమ్మెల్సీల‌తో ల‌గ‌డ‌పాటి ఇష్టాగోష్టిగా ముచ్చ‌టించారు. ఉద్య‌మ‌కాలం నాటి ప‌రిస్థితులు ఈ సంద‌ర్భంగా నెమ‌రు వేసుకున్నారు. ల‌గ‌డ‌పాటి సైతం వారితో చిరున‌వ్వుతో మాట్లాడారు. ల‌గ‌డ‌పాటి ఆహ్వానం అందుకున్న ప‌లువురు ఎమ్మెల్సీలు..రాష్ర్టాలుగా ఎలాగూ విడిపోయాం...మ‌నుష్యులుగా మాత్రం క‌లిసి ఉందాం అంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English