బాబునే అనుమానించిన విధేయ త‌మ్ముడు

బాబునే అనుమానించిన విధేయ త‌మ్ముడు

అధికారంలో ఉన్న‌ప్పుడు అధినేత‌కు అంద‌రూ విధేయులుగానే ఉంటారు. అయితే.. చేతిలో ప‌వ‌ర్ ఉన్నా.. లేకున్నా వీర విధేయుడిగా ఉండే కొద్దిమంది నేత‌ల్లో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఒక‌రు. బాబుకు ప‌ర‌మ వీర భ‌క్తుడైన ఆయ‌న అధినేత మాట‌ల్ని అనుమానించిన ఆస‌క్తిక‌ర అంశం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ విష‌యాన్ని అచ్చెన్నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ఈ రోజు ఏపీలో భూత‌ద్దం వేసినా క‌ట్టెల పొయ్యి క‌నిపించ‌ద‌ని.. అంద‌రి ఇళ్ల‌ల్లో గ్యాస్ పొయ్యి మాత్ర‌మే క‌నిపిస్తుంద‌న్నారు.  ఇదంతా అధినేత చంద్ర‌బాబు ఘ‌న‌త‌గా పొగిడేశారు. మామూలుగా పొగిడితే ఆస‌క్తి ఏముంటుంద‌ని.. అందుకే కాస్తంత మ‌సాలా మిక్స్ చేసిన అచ్చెన్న‌.. ఆ మ‌ధ్య‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన మాట త‌న‌కు ఆయ‌న మీద అనుమానం క‌లిగేలా చేసింద‌న్నారు.
గ్యాస్ పొయ్యి.. సిలిండ‌ర్ ప్ర‌తి ఇంటికి ఇచ్చామ‌ని.. భ‌విష్య‌త్తులో సిలిండ‌ర్లు లేకుండా పైపులైను ద్వారా ప్ర‌తి ఇంటికి గ్యాస్ ఇస్తామ‌ని బాబు చెబితే త‌న‌కు అనుమానం కలిగింద‌ని.. అది సాధ్య‌మేనా? అన్న సందేహం క‌లిగింద‌న్నారు.

అయితే.. బాబు మాట‌ను నిదానంగా ఆలోచించి చూస్తే.. క్లారిటీ రావ‌టంతో పాటు.. అధినేత నిర్ణ‌యం స‌రైన‌దేన‌న్న విష‌యం అర్థ‌మైంద‌న్నారు.  ఫ్యూచ‌ర్లో పైపులైను వేస్తాన‌ని బాబు చెప్ప‌టం చూస్తే.. ప్ర‌భుత్వానికి ఎంత దూర‌దృష్టి ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌న్నారు. తాము త‌ప్ప‌నిస‌రిగా పైపు లైను ద్వారా గ్యాస్ స‌ర‌ఫ‌రా చేయ‌టం ఖాయ‌మ‌ని అచ్చెన్న చెప్పుకొచ్చారు. చూస్తుంటే.. అధినేత‌ను పొగిడే స‌రికొత్త ప్ర‌క్రియ‌కు టీడీపీలో అచ్చెన్న షురూ చేసిన‌ట్లుగా క‌నిపించ‌ట్లేదు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English