ఆంధ్ర‌జ్యోతి ఎండీపై నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్‌

ఆంధ్ర‌జ్యోతి ఎండీపై నాంప‌ల్లి కోర్టు సీరియ‌స్‌

కేసు విచార‌ణ సంద‌ర్భంగా కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌టం ప్ర‌ముఖుల‌కు ఒక అల‌వాటు. ఏం చేస్తే కోర్టుకు కోపం వ‌స్తుందో.. అదే ప‌నిని ప్ర‌ముఖులు చేయ‌టం.. ఆకార‌ణంగా మాట ప‌డ‌టం లాంటివి చేసుకుంటుంటారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌.

ఈ రోజు ఆయ‌న నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంది. అయితే.. ఆయ‌న హాజ‌రు కాలేదు. దీనిపై సీరియ‌స్ అయిన న్యాయ‌స్థానం వ‌చ్చే నెల 5న త‌ప్ప‌నిస‌రిగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని ఆదేశించారు. ఇంత‌కీ ఈ కేసేందన్న విష‌యంలోకి వెళితే..  కొద్దికాలం క్రితం ఏపీ ప్ర‌త్యేక హోదా.. క‌ర‌వు అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని కొన్ని క‌థ‌నాల్ని ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించింది.

దీంతో..  జ‌గ‌న్ ప‌రువు.. ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీశారంటూ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌..  ప‌బ్లిష‌ర్ వెంక‌ట శేష‌గిరిరావు.. ఎడిట‌ర్ శ్రీ‌నివాస్ మ‌రికొంద‌రు ఉద్యోగుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  కోరుతూ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నాంప‌ల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విచార‌ణ ఈ రోజుకు కోర్టు ముందుకు వ‌చ్చింది. దీనికి  వేమూరి రాధాకృష్ణ కోర్టుకు హాజ‌రుకాలేదు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ‌కు వెళితే స‌రిపోయే దానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌టం ఎందుకో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు