ఇండిగో నెత్తికి మ‌రో రెండు వివాదాలు

ఇండిగో నెత్తికి మ‌రో రెండు వివాదాలు

చౌక‌ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ అన్న పేరు విన్న వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది ఇండిగో. త‌క్కువ ధ‌ర‌ల‌తో.. నాణ్య‌మైన సేవ‌లు అందిస్తుంద‌న్న పేరు ఈ సంస్థ సొంతం. షెడ్యూల్ టైమ్‌కి విమానం బ‌య‌లుదేర‌టం ద‌గ్గ‌ర నుంచి గ‌మ్య‌స్థానం చేర్చే విష‌యంలో ఇండిగో మీద పెద్ద‌గా రిమార్కులు లేవ‌నే చెప్పాలి. కానీ.. ఈ మ‌ధ్య‌న ఇండిగో టైం ఏ మాత్రం బాగోలేద‌న్న‌ట్లుగా ఉంది.

ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి అన్న‌ట్లుగా ప‌లు వివాదాలు ఇండిగోకు చుట్టుకుంటున్నాయి. ఈ మ‌ధ్య‌న ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ సింధుతో ఇండిగో సిబ్బంది అమ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌వ‌ర్తించ‌టంతో తొలుత వార్త‌ల్లోకి ఎక్కింది. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డేస‌రికి ఇండిగోకు చుక్క‌లు క‌నిపించాయి. ఈ వివాదంలో ఇండిగో పేరు ప్ర‌ఖ్యాతులు దెబ్బ తిన్నాయి. ఇదిలా ఉంటే.. ఒక ప్ర‌యాణికుడి విష‌యంలో ఇండిగో సిబ్బంది దారుణంగా ప్ర‌వ‌ర్తించ‌టం.. దాడికి దిగ‌టం.. అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌టంతో ఇండిగోకు జ‌రిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

మీడియాలో విస్తృతం ప్ర‌చార‌మైన ఈ ఉదంతంలో ఒక ప్ర‌యాణికుడ్ని ఇండిగో సిబ్బంది అలా చేయి చేసుకోవ‌టం ఏమిటంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో ఉదంతాలు ఇండిగో చోటు చేసుకున్నాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఒక ఉదంతం కాస్త ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వచ్చింది. శ‌నివారం రాత్రి ఒక దివ్యాంగురాలు వీల్ ఛైర్ లో నుంచి ప‌డిపోయారు. ల‌క్నోకు చెందిన ఊర్వ‌శి అనే యువ‌తి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. వీల్ ఛైర్లో ఉన్న ఆమెకు సాయం చేసేందుకు ఇండిగో సిబ్బంది ప్ర‌య‌త్నించారు. ఆమెను సిబ్బంది తీసుకెళుతున్న స‌మ‌యంలో వీల్ ఛైర్ అదుపు త‌ప్పి కింద‌కు ప‌డిపోయారు. దీంతో.. ఆమెకు దెబ్బ‌లు త‌గిలాయి. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. పొర‌పాటున జ‌రిగిందే త‌ప్ప కావాల‌ని చేయ‌లేద‌ని చెబుతూ.. ఇండిగో చెంప‌లేసుకుంది. ఏంటో ఒక‌టి త‌ర్వాత మ‌రొక‌టి చొప్పున చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు చూస్తే..  ఇండిగో టైం బాగోలేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English