ప్రకృతి.. మనుషులు.. అండ్ శాడిజం

ప్రకృతి.. మనుషులు.. అండ్ శాడిజం

ప్రస్తుతం ఢిల్లీలో పొగమంచు చాలా చాలా దారుణంగా ఉంది. అసలు ఇంతగా వాతావరణం జనాలపై దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా.. ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్ లో యమునా ఎక్స్ ప్రెస్ హైవే మీద జరుగుతున్న యాక్సిడెంట్స్ మరీ ఘోరంగా ఉన్నాయి.

ఇక్కడ యాక్సిడెంట్స్ కంటే.. స్పాట్ లో ఉన్న జనాల ప్రవర్తన మరింత ఆందోళనకరంగా ఉంది. ఇదే విషయాన్ని చెప్పిన హ్యూమా ఖురేషీ.. తనకు వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పైకి అనకపోయినా.. వీళ్లు మనుషులా.. శాడిస్టులా అని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది హ్యూమా ఖురేషీ పోస్ట్.

ఆ వీడియోలో జనాలు యమునా ఎక్స్ ప్రెస్ హైవే మీద జరిగే యాక్సిడెంట్లను రికార్డు చేయడానికి తెగ ఉత్సాహం చూపించేస్తూ.. వీడియాలను తీసేస్తూ ఆనందపడుతున్నారు. ఒక ప్రక్కన కారులోని మనుషులను కొందరు తప్పిస్తుంటే.. మరో ప్రక్కన మరికొందరు మాత్రం.. తర్వాత వచ్చి గుద్దుకునే కారు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తూ.. మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నారు.

ఈ వీడియోనే షేర్ చేసిన హ్యూమా ఖురేషీ.. 'ఢిల్లీలో జరుగుతున్నది చూస్తే చాలా భయంగా ఉంది. యమునా ఎక్స్ ప్రెస్ వే మీద జరుగుతున్న తతంగాన్ని ఎవరో నాకు పంపారు' అంటూ ట్వీట్ చేసింది. ఒక ప్రక్కన ప్రకృతి విలయతాండవం.. మరో ప్రక్కన మనిషి తాలూకు వైపరిత్యం.. వెరసి వినాశనం. కాదంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు