బాబు దూకుడుకు మోడీ స‌డ‌న్ బ్రేక్‌

బాబు దూకుడుకు మోడీ స‌డ‌న్ బ్రేక్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శిబిరానికి ఇంకో బ్యాడ్ న్యూస్. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అంశాల్లో మొద‌టిది రాజ‌ధాని అమ‌రావ‌తి అయితే రెండ‌వ‌ది అమ‌రావ‌తి. ఏకంగా ఒక రోజును ప్ర‌త్యేకంగా కేటాయించి ఈ ప్రాజెక్టు ప‌నుల‌పై స‌మీక్షలు నిర్వ‌హిస్తున్నారు. ప‌నుల్లో వేగంగా పెంచాల‌ని బాబు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ కాంట్రాక్ట‌ర్ జాప్యం, నిధుల లేమీ ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల  అనుకున్న స్థాయిలో సాగ‌డం లేద‌నే భావ‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ..బాబు ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో దూకుడునే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా బాబు స్పీడ్‌కు మోడీ స‌డ‌న్ బ్రేక్ వేశారు.

పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2019 నాటికి దీని నిర్మాణంపూర్తిచేయాలని ఆశిస్తోంది. అనుకున్న సమయానికి పూర్తయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకశ్రద్ద తీసుకుంటున్నారు. ఈ దశలో కేంద్రం దీని నిర్మాణాన్ని నిలిపివేయాలని, అసలు ఈ డ్యామ్‌ ఆవశ్యకత లేదని తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఎక్కడి పనులు అక్కడ ఆపేయాలంటూ ఉత్తర్వులు జారీచేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాంకేతిక నిపుణుల్ని పోలవరం పంపించి కాఫర్‌డ్యామ్‌ నిర్మాణ ఆవశ్యకతపై అధ్యయనం జరిపించాలని నిర్ణయించినట్లు వెలువడ్డ వార్త సంచలనం సృష్టిస్తోంది.

రానున్న ఎన్నిక నాటికి అమరావతి పోలవరం ప్రాజెక్టులు రెండింటినీ రెండుకళ్ళుగా భావించి ప్రచారం చేసుకోవాలన్నది తెలుగుదేశం యోచన. దీనిపై చంద్రబాబు పదేపదే తన అభిప్రాయం చెప్పుకొస్తున్నారు. అమరావతి నిర్మాణం అంతర్జాతీయస్థాయిలో సాగుతోంది. ఎన్నికల్లోగా ఇది పూర్తవుతుందన్న విశ్వాసం ప్రజలెవరికీ లేదు. దీంతో ఈ నిర్మాణంపై ఇప్పుడు ఎవరూ దృష్టిపెట్టడంలేదు.

కానీ 2019 నాటికి పోలవరం ఖచ్చితంగా పూర్తవుతుందన్న నమ్మకాన్ని చంద్రబాబు కల్గించారు. దీన్ని చూపించే తిరిగి మరోసారి అధికారంలోకి రావాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ దశలో క్యాపర్‌డామ్‌ నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేస్తే ఇక పోలవరం నిర్మాణం ఏవిధంగానూ 2019 నాటికి పూర్తికాదు. దీంతో ఇది ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలతోపాటు ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. అసలు పోలవరం భవిష్యత్‌ ఏమిటన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు