ప్రత్యేక హోదాపై జగన్‌ను డిఫెన్సులో ప‌డేశాడు

ప్రత్యేక హోదాపై జగన్‌ను డిఫెన్సులో ప‌డేశాడు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ విపక్ష నేత జగన్ తరచూ ఎదురుదాడి చేయడం తెలిసిందే. అయితే.. తాజాగా టీడీపీ నేతలు జగన్‌పై రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. జగన్ తాను చెప్పిన మాటలను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రత్యేక హోదా రాకపోతే తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పారని.. ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదని, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు ప్రశ్నించారు.

పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా జ‌గ‌న్‌ ప్రత్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్త‌డం ఏంట‌ని ఆయన ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జ‌గ‌న్, ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని అడిగారు. ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం విశాఖప‌ట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు పెడితే దాన్ని కూడా జగన్ అడ్డుకునే య‌త్నం చేశార‌ని కళావెంకట్రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఆందోళ‌న చేయ‌డానికి వెళుతోన్న‌ జ‌గ‌న్‌ను విశాఖ‌ప‌ట్నంలోని విమానాశ్ర‌యంలో అడ్డుకుంటే, తాను త్వరలో సీఎంని అవుతానని, ఆ త‌రువాత అంద‌రి ప‌నీ చెబుతాన‌ని పోలీసుల‌ని బెదిరించారని అన్నారు. అటువంటి జ‌గ‌న్ మాట‌ల‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌బోర‌ని చెప్పారు.

మరోవైపు జగన్ ప్రజాసంకల్పయాత్ర పేరుతో ప్రజల్లోకి పాదయాత్రగా వెళ్తుండడంతో టీడీపీ నేతలు, మంత్రులు అటాకింగ్ మొదలుపెట్టారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ చెబుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు రివర్స్ కౌంటర్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు