లేదంటే ఎలా లోకేష్‌ గారూ?

లేదంటే ఎలా లోకేష్‌ గారూ?

తెలుగుదేశం పార్టీకి పత్రిక, ఛానల్‌ లేవని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడైన నారా లోకేష్‌ అన్నారు. విడ్డూరమే ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు 'ఆ రెండు పత్రికలు', 'ఆ రెండు ఛానళ్ళు' ఎవరి కోసం పనిచేస్తున్నాయో.

ఆ రెండు పత్రికలు, ఛానళ్ళలో కథనాలొస్తాయి, వాటిని పట్టుకుని తెలుగుదేశం నేతలు రాజకీయ విమర్శలు చేస్తారు. లేదంటే టిడిపి వారు చేసే విమర్శలు ఆ మీడియా సంస్థలలో ఎక్కువగా చూపించబడతాయి. లోకేష్‌ కొంతకాలం ఓ న్యూస్‌ ఛానల్‌ని 'మేనేజ్‌' చేశారని కూడా విమర్శలున్నాయి. ఏదేమైనా, తెలుగుదేశం పార్టీకి పత్రిక, ఛానల్‌ లేవని చెప్పడం సమంజసం కాదేమో.

లోకేష్‌, కేంద్ర మంత్రి చిరంజీవిపైన కూడా విమర్శిలు చేయడం జరిగింది. సామాజిక న్యాయం అన్నవారు సొంత న్యాయం చూసుకుని వెళ్ళిపోయారన్నారు లోకేష్‌. రైతుల రుణమాఫీ, మద్యం బెల్టు దుకాణాలను రద్దు చేస్తామని ఎన్నికల హామీలూ లోకేష్‌ ఇవ్వడం తెలుగుదేశం వారికి ఆనందాన్నిస్తోన్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English