సానియా మీర్జాకు గట్టిగా తగులుకున్నారే..

సానియా మీర్జాకు గట్టిగా తగులుకున్నారే..

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భారత అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్లు. తన భర్తకు, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఏం మాట్లాడినా.. ఏ ట్వీట్ పెట్టినా నెటిజన్లు ఆమెను ఆడేసుకుంటున్నారు. తాజాగా సానియా మరోసారి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. నిన్న పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కు సంబంధించి సానియా వరుసగా ట్వీట్లు పెట్టింది. తన భర్త మాలిక్ ఈ మ్యాచ్ అనంతరం 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' కింద గెలుచుుకన్న బైక్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది.

ఇది భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఓవైపు భారత జట్టు.. న్యూజిలాండ్‌ను ఓడించి వన్డే సిరీస్ గెలిస్తే దాని గురించి పట్టించుకోకుండా పాకిస్థాన్ మ్యాచ్‌గా గురించి ట్వీట్లు పెట్టడం మనోళ్లకు నచ్చలేదు. ఇక్కడ మన ఇండియా కూడా మ్యాచ్ ఆడింది, సిరీస్ గెలిచింది.. అది నీకు పట్టదా పాకిస్థాన్ కోడలా అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా సానియా ముందు చలించలేదు. కానీ కాసేపటికి ఈ తరహా ట్వీట్లు పెరగడంతో సానియా స్పందించక తప్పలేదు. కొన్ని గంటల తర్వాత సిరీస్ విజయం సాధించిన కోహ్లీసేనకు అభినందనలంటూ ఒక ట్వీట్ పెట్టి సైలెంటైపోయింది. ఐతే పాకిస్థాన్ మ్యాచ్‌ గురించి సానియా ఎగ్జైట్ కావడానికి కారణాలు లేకపోలేదు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌కు స్వయంగా సానియా హాజరైంది. లాహోర్‌కు వెళ్లి స్టేడియంలో ఈ మ్యాచ్ చూసి భర్తను ఉత్సాహపరిచింది సానియా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు