రేవంత్‌కు ప‌రోక్ష షాకిచ్చిన కేసీఆర్‌

రేవంత్‌కు ప‌రోక్ష షాకిచ్చిన కేసీఆర్‌

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మొద‌టి షాక్ ఎదురైంది. త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని డిసైడ్ చేసుకునేందుకు స‌న్నిహితుల‌తో మీటింగ్ పెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి డిసైడ్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇక్క‌డే మొద‌టి షాక్ ఎదుర‌యింది. సోమవారం  హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో, అభిమానులు, ఇతర నేతలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగ‌ల్‌లో నేత‌ల‌తో రేవంత్ రెడ్డి చెప్పారు.... అయితే అనూహ్య‌మైన ట్విస్ట్ ఎదురైంది.

జ‌లవిహార్‌లో రేవంత్ మీటింగ్ కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులు పర్మిషన్ కు నో చెప్పేశారు.  కాగా ఇక్క‌డే అనూహ్య‌మైన ట్విస్ట్ ఎదురైంది. జ‌ల‌విహార్‌లో వేరే కార్యక్రమలకు పర్మిషన్ ఇచ్చినట్లు రేవంత్‌కు తెలిసింది. దీంతో పోలీసుల‌తో రేవంత్ వాగ్వాదానికి దిగారు. వేరే కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇచ్చి...త‌మ కార్యక్రమానికి ఎందుకు ఇవ్వరు అని డీసీపీని రేవంత్ ప్రశ్నించినట్లు స‌మాచారం. `ఇలా కూడా నా మీద కక్ష తీర్చుకుంటున్నారు` అని రేవంత్ వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే జ‌ల‌విహార్‌లో అనుమ‌తి ద‌క్క‌క‌కపోయిన‌ప్ప‌టికీ...త‌న ఏర్పాట్ల‌లో తానుండిపోయారు. జూబ్లిహిల్స్ లోని ఇంటి వద్దే మీటింగ్ కు రేవంత్‌ సిద్ధ‌మ‌య్యారు. రేపు అంతా తన ఇంటికే చేరుకోవాలని రేవంత్ సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English