నందమూరి మూడోతరం

నందమూరి మూడోతరం

నందమూరి వారసత్వం శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. అదే విధంగా నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నందమూరి మూడవ తరం మొగ్గ తొడుగుతోంది. ఎన్టీఆర్ నుంచి పార్టీ వారసత్వాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాయుడు బంధుత్వాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని పాలించారు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో బోల్తాకొట్టిన తరువాత బాబుకు బంధుత్వాలు గుర్తుకొచ్చాయి. ఎన్టీఆర్ వారసులను దగ్గర తీయడం, ఎన్టీఆర్ బొమ్మలకు ప్రాధాన్యమివ్వడం, ఎన్టీఆర్ విగ్రహానికి నమస్కరించి పనులు ప్రారంభించడం చేస్తున్నారు.

అదే విధంగా నెమ్మదిగా బావ మరదులు హరికృష్ణ, బాలకృష్ణలను దగ్గర తీశారు. తండ్రి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న లోకేశ్ గత రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘వస్తున్నా మీకోసం’ యాత్రలో అక్కడక్కడా తండ్రితో కలసి తిరిగారు. ఇప్పుడు పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకునేందుకు అటునుంచి నరుక్కొస్తున్నారు. ఒకవైపుకార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూనే మరోవైపుకుటుంబ సభ్యుల మధ్య ఐక్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అందుకే దీపావళి ముందురోజు నందమూరి మూడవ తరానికి చెందిన వారినందరిని ఒక చోటుకు చేర్చి ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. ఎన్టీఆర్ వారసుడిగా ముద్ర వేసుకోవాలనుకునే జూనియర్ ఎన్టీఆర్ ఆ సమావేశానికి రాకపోవడంలో విశేషం ఏమీలేదు. అయినప్పటికీ ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా లోకేశ్ నందమూరి మూడోతరం వారి మద్దతు పొందడానికి కృషిచేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు