సోనియాకు అస్వ‌స్థ‌త‌....కాంగ్రెస్ నేత‌ల‌కు టెన్ష‌న్‌

సోనియాకు అస్వ‌స్థ‌త‌....కాంగ్రెస్ నేత‌ల‌కు టెన్ష‌న్‌

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య ఎదురుకావ‌డంతో ఇవాళ‌ సాయంత్రం కుటుంబ సభ్యులు ఆమెను ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చేర్చారు. క‌డ‌పులో నొప్పి కార‌ణంగా ఆమెను ఆస్ప‌త్రిలో చేర్చిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, చికిత్స వివరాలను తెలియజేస్తామని గంగారాం ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలోని సోనియా సన్నిహిత నేతలు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఈ విష‌య‌మై పూర్తి స‌మాచారం అధికారికంగా వెలువ‌డాల్సి ఉంది.

కాన్సర్ బారిన పడిన నాటి నుంచి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఏదో ఒక రూపంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా అస్వస్థతకు గుర‌వ‌డం...గంగారామ్ ఆస్పత్రిలో చేర్చ‌డంతో కాంగ్రెస్ పార్టీలో ఒకింత క‌ల‌వ‌రం మొద‌లైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు