రేవంత్‌కు ఆప్పుడే కాంగ్రెస్ నేత‌ల్లో ఫ్యాన్స్ మొద‌ల‌య్యారు

రేవంత్‌కు ఆప్పుడే కాంగ్రెస్ నేత‌ల్లో ఫ్యాన్స్ మొద‌ల‌య్యారు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి? ఎందుకు ఇంత క‌ఠినమైన ప్ర‌శ్న అడిగారు...అంటూ ఆలోచిస్తున్నారు క‌దా? అవును మ‌రి. సొంత పార్టీ అయిన టీడీపీకి...ఆయ‌న కోవ‌ర్టు అయిపోయాడు...త‌న సొంత రాజ‌కీయాల కోసం త‌మ‌ పార్టీని బ‌లిప‌శువును చేశాడ‌ని టీడీపీ ఆరోపిస్తోంది. మ‌రోవైపు కాంగ్రెస్ నేత‌లేమో మా పార్టీలోకి వ‌చ్చేస్తున్నాడ‌ని చెప్తున్నారు. ఇంకోవైపు సూప‌ర్ ట్విస్ట్ ఇస్తూ...తాను కాంగ్రెస్ పార్టీలో చేరేది అంతా ప్ర‌చార‌మే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇలా సందేహాలు....ట్విస్టుల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌గానే...లంగాణ అసెంబ్లీ వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన టీడీఎల్పీ నాయ‌కుడు, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సొంత పార్టీ నేతలెవరూ ఆయనతో మాట్లాడలేదు. అయితే అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌లు అక్క‌డే ఉన్నారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప‌రిణామం అంద‌రినీ ఆక‌ర్షించింది. సీనియర్ నేతలు సైతం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసి కరచాలనం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మ‌రోవైపు టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ప‌రిణామాల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత గొడవలు సృష్టించే యత్నం జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని...తన వ్యతిరేకత అంతా కేసీఆర్ పైనే నన్నారు. తాను హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవ్వడం సహా తనపై ఆరోపణలన్నిటీకి పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి రాగానే ఆయనకు వివరిస్తానని చెప్పారు. అయితే అధినేత హైదరాబాద్ వచ్చేలోగానే పార్టీని భ్రష్టు పట్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ నాయకుడైనా పార్టీ క్యాడర్ ఏం కోరుకుంటున్నారో అదే చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ ను చూస్తే బాధగా ఉందని రేవంత్ అన్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన పాలు పోసే చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు