జగనన్న తెచ్చేది జైలు రాజ్యమే

జగనన్న తెచ్చేది జైలు రాజ్యమే

మొన్న మోపిదేవి అరెస్టు, ఇప్పుడు సబిత, ధర్మానల రాజీనామా, అంధకారంలో మరో ముగ్గురు మంత్రుల భవిష్యత్తు, వెరసి కాంగ్రెస్‌ పార్టీలో అనిశ్చితి నెలకొంది. జరుగుతున్న తంతును చూస్తుంటే చాలామంది మంత్రులకు పీకలదాకా కోపమొస్తోంది. అసలు జగన్‌ ధన దాహంవలనే ఇలా కాంగ్రెస్‌ మంత్రులు ఊచలు లెక్కట్టే పరిస్థితి వచ్చిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు.

చిరంజీవి గ్రూపు మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ జగన్‌ ఎప్రూవర్‌గా మారితే, జరిగిన విషయాలు తెలుస్తాయని, మంత్రులను, రాష్ట్రం పరువును కాపాడవచ్చని పలికారు. ఇక మరో మంత్రి తోట నరసింహులు మాట్లాడుతూ, కొడుకును వెనకేస్తున్న విజయమ్మ ఇప్పటికైనా జగన్‌ చేసిన అక్రమాల చిట్టాలను విప్పాలని చెబుతున్నారు.

జగన్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెబుతున్న వైకాపా నేతల మాటలు నిజంకాదని, ఈ పార్టీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జైలురాజ్యమే వస్తుందని ఎద్దేవాచేశారు. ఇలా మంత్రులందరూ ఎవరికి తోచినట్లు వారు జగన్‌ను ఏకిపారేస్తుంటే, వైకాపా నేతలు మాత్రం జగన్‌ను లోపేశారు కాబట్టి మంత్రులను కూడా వెయ్యాలని చెప్పడం కాస్త విడ్డూరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English