కృష్ణా జిల్లా యువ‌కుడికి లోకేష్ రీట్వీట్‌!

కృష్ణా జిల్లా యువ‌కుడికి లోకేష్ రీట్వీట్‌!

సామాజిక మాధ్య‌మాల్లో మ‌రీ ముఖ్యంగా ట్విట్ట‌ర్‌లో రాజ‌కీయ నాయ‌కులు యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్ర‌ధాని మోదీ నుంచి ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన వారుకూడా దీనిని సాధ్య‌మైనంత‌గా ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేం దుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అంతేగాక ట్విట్ట‌ర్‌లో తెలిపిన‌ ప్ర‌జా స‌మస్య‌ల‌పై వెంట‌నే స్పందించి.. అప్ప‌టిక‌ప్పుడు కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే వాటిని ప‌రిష్క‌రించేలా చేస్తున్నారు. కొంద‌రు నాయ‌కులు మాత్రం.. స‌మ‌స్య పరిష్క‌రిస్తారో లేదో తెలీదు గానీ.. `మీ స‌మ‌స్య చెప్పండి. వెంట‌నే ప‌రిష్క‌రించేస్తా` మ‌ని చెబుతుంటారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌ కూడా ఇలాంటిదే ఎంచుకున్నారు.

`మీ ప్రాంతంలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పేరు, ఊరు, మండ‌లం, ఫోన్ నెంబ‌రు పేర్కొంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలపండి' అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దీంతో దుర్గానాథ్ అనే యువ‌కుడు త‌మ ప్రాంతంలో స‌మ‌స్య ఉంద‌ని తెలిపాడు.`హ‌లో స‌ర్‌. మాది రామ‌న‌గ‌రం, చ‌ల్ల‌ప‌ల్లి మండ‌ల్, కృష్ణా జిల్లా. రోడ్లు బాగోలేవు` అని స్పందించాడు. 

పేర్కొంటూ త‌న ఫోన్ నెంబ‌రుని పోస్ట్ చేశాడు. దీనిపై వెంట‌నే స్పందించిన నారా లోకేశ్.. ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం త్వ‌ర‌లోనే చూపుతామ‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు