కేసీఆర్ నీ వ‌ల్లే తెలంగాణ రాలె: జానా

కేసీఆర్ నీ వ‌ల్లే తెలంగాణ రాలె: జానా

టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను 'వాడు, వీడు' అంటూ మీడియా ముఖంగా విరుచుకుప‌డిన టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల ప‌ర్వం ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి నిప్పులు చెరిగారు. అయితే, మిగిలిన వారిలా కాకుండా ఒకింత నిర్మాణాత్మ‌కంగా కేసీఆర్‌నుఓ ప‌ద్ధ‌తిలో ఏకేశారు.  కేసీఆర్ ఒక్క‌డి వ‌ల్లే తెలంగాణ రాలేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎంతో మంది త్యాగ ఫ‌లంగానే తెలంగాణ సాకార‌మైంద‌ని చెప్పారు.

తెలంగాణ జేఏసీకి అప్పట్లో అందరం కలిసే పేరు పెట్టామని, ఇప్పుడు మొత్తం క్రెడిట్ అంతా త‌న‌దేన‌ని ఇప్పుడు చెప్ప‌డం కేసీఆర్‌కు త‌గ‌ద‌న్నారు. ప్ర‌స్తుతం త‌న పాల‌న విఫ‌లం కావ‌డంతో భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని జానా విమ‌ర్శించారు. ఏదేమైనా.. కోదండ రాంపై ఆ విధంగా విరుచుకుప‌డ‌డం స‌రికాద‌ని అన్నారు. కేసీఆర్ లా తాను నీచంగా మాట్లాడలేనని... అలా మాట్లాడితే కేసీఆర్ కు, తనకు తేడా ఏముంటుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నోటికి హ‌ద్దు అదుపు లేకుండా పోతోంద‌ని అన్నారు.

ఏదేమైనా.. తాజాగా కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్య‌లు రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రినీ క‌ల‌చి వేశాయ‌ని అన్నారు. కేసీఆర్ వ్యవహారశైలి పట్ల ప్రజలు ఆలోచించాల‌ని, ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకోవాల‌ని, అప్పుడు వారు సంధించే ప్రశ్నలకు కేసీఆర్ ప్ర‌జాకోర్టులో నిల‌బ‌డి స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే ఆయనకు సరైన సమాధానమని చెప్పారు. ఇలా మాట్లాడ‌డం స‌రికాద‌ని అన్నారు. రాష్ట్రానికి బాధ్య‌త వ‌హించే నేత ఇలా ఎందుకు మాట్లాడాల్సి వ‌చ్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. అయితే, కేసీఆర్‌లా మాట్లాడే వారు ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ పుట్టుకు వ‌స్తార‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English