కోదండ‌రం అనేవాడు ఎవ‌డు? వాడెదో గొప్ప నాయ‌కుడా? ల‌ంగా యాత్రః కేసీఆర్ నిప్పులు

కోదండ‌రం అనేవాడు ఎవ‌డు? వాడెదో గొప్ప నాయ‌కుడా? ల‌ంగా యాత్రః కేసీఆర్ నిప్పులు

``కోదండరాం అనే వాడు...టీఆర్‌ఎస్ ప‌ట్ల‌ విషపూరితమైన వ్యక్తి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేకుండే. నేను తయారు చేసిన లక్షల మంది నాయకుల్లో వీడొకడు. వీడు చేసిందేమీ లేదు తొక్క. నీ సక్కదనానికి జీవితంలో సర్పంచ్‌ గా గెలిచినవా? కోదండరాం పిలుపునిచ్చిండట.. ఆయన ఎవరు పిలుపినివ్వడానికి ఆయనేమైనా సిఎం ఆ?  ఆయనేదో జాతీయ నాయకుడైనట్లు పిలుపిస్తడా? వాడేదో గొప్ప అనుకుంటున్నడు. ఏదో బండి కింద కుక్క పోతున్నప్పడు నేనే మోస్తున్న అనుకుంటది కుక్క తీరులా ఉంది కోదండరాం పని`` ఇవి మీడియా సమావేశంలో జేఏసీ చైర్మెన్‌ కోదండరాంను ఉద్దేశించి  సీఎం కేసీఆర్ ఉప‌యోగించిన భాష‌.

``కోదండరాం ఎక్కువ ఊహించుకొని పరేషాన్ అయితండు. ఏ యాత్రలనైనా 500 మంది వచ్చిండ్రా? రాజకీయ గుల ఉంటే ముసుగు ఎందుకు? డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి రావొచ్చుగా. ఆయనది అమరుల స్ఫూర్తియాత్ర కాదు.. లంగా రాజకీయ స్ఫూర్తియాత్ర. టీబీజీకేఎస్‌కు ఒక్క ఓటు వేయద్దంటాడా? టీబీజీకేఎస్ గెలిస్తే సింగరేణి నాశనం అయితదంటడా.నువ్వు ఎవరు అసలు? సర్పంచ్ అన్నా అయిండా? పిలుపుఇస్తరా.. శక్తి ఎంతో గంతే ఊహించుకోవాలి.. జేఏసీ ఏర్పాటు చేసిందే నేను. జేఏసీ లక్ష్యం, విధానాలు రూపొందించిందే నేనే. జయశంకర్ సార్‌ను జేఏసీ చైర్మన్‌గా ఉండమని రిక్వెస్ట్ చేశాను. ఆయన కోదండరాం పేరు చెప్పారు. ఇప్పుడున్న జేఏసీకి అర్థమే లేదునీ జేఏసీలో ఎవలున్నరు? ఎవడన్నా ఉన్నడా? దిక్కుమాలినోళ్లను పెట్టుకుని సంఘం పెట్టి ఏదో అయిత అనుకుంటే ఐతదా? అమరుల స్పూర్తి యాత్రనా? లంగా రాజకీయ యాత్రనా? నువ్వు చేసేది?. ఆయనేమీ అమాయకుడు కాదు. కాంగ్రెస్‌ తో రహస్యంగా కలిశాడు. ఈన సాధించిన ఘనకార్యమేంది తొక్క. పనికిరాని నలుగురు పోరగాండ్లను పెట్టుకొని ప్రచారం అంటూ వెళ్తున్నావు. నీకు అవకాశం కూడా ఇచ్చినా, ఎంపీనో, ఎమ్మెల్యేనో కావాలంటే పోటీ చేయమన్నా. వినకుండా అన్నింటికి అడ్డుపడి ఏదో చేసినట్టు ప్రచారం చేస్తున్నావు. జాతిపిత లాగా పిలుపు ఇస్తున్నావు``

ఇవి ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు. వ‌దిలిన వాగ్భాణాలు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కోదండరాం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు. అయితే ఎందుకు అంతలాగా సీఎం కేసీఆర్ కోదండ‌రాంపై విరుచుకుప‌డ్డార‌నేది అంద‌రికీ ఆస‌క్తిక‌రం. కొద్దికాలం క్రితం వ‌ర‌కు పార్టీ నేత‌లు మాత్ర‌మే కోదండ‌రాం విష‌యంలో స్పందించారు. అనంత‌రం కేసీఆర్ రియాక్ట‌య్యారు. తాడు బొంగ‌రం లేని వ్య్త‌క్తంటూ..ఎద్దేవా చేశారు. అక్క‌డితోనే ఆపివేయ‌కుండా బూతుల ప‌ర్వం అందుకున్నారు. వాడు, వీడు, లంగా, అరే..ఇలాంటి భాషలో మాట్లాడటం  రెండు గంటలకు పైగా సాగిన ప్రెస్‌ మీట్‌ లో కోదండరాం పై బూతుల వర్షం కురిపించారు. అయితే ఎందుకు ఇంత అస‌హ‌నం? ఏమిటి ఈ భాష అనేది పార్టీ శ్రేణుల‌కు సైతం అంతుప‌ట్ట‌కుండా ఉంద‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడ‌టం ఏమిట‌ని ప‌లువురు కేసీఆర్ తీరును త‌ప్పుప‌డుతున్నారు. కానీ కేసీఆర్ ఇవేమీ ప‌ట్టించుకునే త‌త్వం కాదు క‌దా?

కొస‌మెరుపుః ఇన్ని బండ‌బూతులు తిట్టిన కేసీఆర్‌...రాజ‌కీయాల్లో హుందాత‌నం ఉండాల‌ని చెప్పారు. ఎదుటివాళ్ల మ‌న‌సులు గాయ‌ప‌ర్చేలా చేయ‌డం స‌రికాద‌ని కాంగ్రెస్ నేత‌ల‌కు హిత‌వు ప‌లికారు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English