చిన్న‌మ్మ‌కు జైలు నుంచి బ‌య‌టకు వ‌చ్చిన తృప్తిని మిగ‌ల్చ‌ట్లే

చిన్న‌మ్మ‌కు జైలు నుంచి బ‌య‌టకు వ‌చ్చిన తృప్తిని మిగ‌ల్చ‌ట్లే

అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత నెచ్చెలి, ఆ పార్టీ బహిష్కృత కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని ట్విస్టులు ఎదుర‌వుతున్నాయి. అవినీతి కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న శశికళకు ఇవాళ పెరోల్‌ లభించిన సంగ‌తి తెలిసిందే. శశికళ పరప్పణ జైలు నుంచి చెన్నై చేరుకున్నారు. బెంగళూరు నుంచి ఆమె రోడ్డు మార్గం ద్వారా చెన్నై చేరుకున్నారు. మేనకోడలు నివాసంలో ఇవాళ బసచేయనున్న శ‌శిక‌ళ రేపు ఉదయం గ్లోబల్ ఆస్పత్రిలో భర్త నటరాజన్ ను పరామర్శించనున్నారు. అయితే ఆమెకు బెయిల్ ద‌క్కిన ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు తాజా మాజీ సీఎంలు ప‌ళ‌నిస్వామి ప‌న్నీర్ సెల్వం.

ఎన్నికల సంఘం వద్ద అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయమై శుక్రవారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ శశికళ, దినకరన్‌లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉపప్రధాన కార్యదర్శిగా దినకరన్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. తమదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అని రెండాకుల గుర్తు తమకే చెందాలని ఎన్నికల సంఘం ఎదుట వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఎన్నికల సంఘం ఈ నెల 13కు వాయిదా వేసింది. అదేరోజు దినకరన్ వర్గం ఎన్నికల సంఘం ఎదుట తమ వాదనలు వినిపించనున్నారు. కాగా అన్నాడీఎంకే పార్టీ గుర్తు అంశంపై టీటీవీ దినకరన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ గుర్తు అంశంపై ఇప్పుడే తేల్చవద్దంటూ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై సుప్రీం స్పందిస్తూ పార్టీ గుర్తు విషయమై ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది.

కాగా, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో భర్త చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆమెకు పెరోల్‌ మంజూరీ చేశారు. అయితే షరతులతో కూడిన పెరోల్‌ను కోర్టు జారీ చేసింది. చెన్నై వెళ్లిన తర్వాత ఆమె ఎవర్నీ కలువకూడదని షరతు పెట్టారు. మీడియాతో మాట్లాడడం కానీ, రాజకీయ ప్రకటనలు చేయరాదని తెలిపారు. శశికళ భర్తకు రెండు రోజుల క్రితం కిడ్నీ మార్పిడి చేశారు. పెరోల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన శశికళను  జైలు వద్ద రిసీవ్‌ చేసుకునేందుకు దినకరన్‌ అక్కడకు చేరుకున్నాడు. సుమారు 8 నెలలుగా బెంగుళూరు సెంట్రల్‌ జైలులో ఉన్న ఆమె ఇవాళ పెరోల్‌పై బయటకు వ‌చ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు