మేము ఏ తప్పూ చేయలేదు

మేము ఏ తప్పూ చేయలేదు

మొత్తానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా, ధర్మానల రాజీనామా అంశంపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరూ కూడా ముఖ్యమంత్రిని కిరణ్‌ను కలసి తాము గతంలో సమర్పించిన రాజీనామా పత్రాలను ఆమోదించుకోండని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇకపోతే కిరణ్‌తో మీటింగ్‌ ముగించుకొని, మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి ప్రతిపక్షాలు తమను కళంకిత మంత్రులని, నేరగాళ్ళని అనడం ఏమాత్రం సరికాదని ఆవేదన వ్యక్తంచేశారు. అవినీతికి పాల్పడినట్లు సిబిఐ కేవలం ఆరోపణులు మాత్రమే చేసిందని, ఇంకా కోర్టులో అవి ప్రూవ్‌ కావల్సిఉందని సబిత తెలిపారు.

ఇదే విషయంపై స్పందించిన ధర్మాన కూడా తాను పార్టీను విడిచి వెళ్ళేది లేదని, కాంగ్రెస్‌లోనే ఉండి సిబిఐ చేసిన ఆరోపణలపై పోరాటం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇన్‌డైరెక్టుగా మంత్రులిద్దరూ వైఎస్‌ చెప్పిందే చేశామని, కొత్తగా ఏం ట్రై చెయ్యలేదని చెప్పడం విశేషం. బిజినెస్‌ రూల్స్‌కు విరుద్దంగా ఏ పనీ చెయ్యలేదని చెబుతున్న మంత్రులు, అసలు ఆ జిఓల వెనుకున్న అసలు మర్మం చెప్పకపోతే ఎలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English