గ‌నులలో దూసుకెళ్లిన‌ గులాబీ కారు

గ‌నులలో దూసుకెళ్లిన‌ గులాబీ కారు

అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నా వ‌మ్ము కాలేదు. పోటాపోటీగా ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ.. అధికార‌ప‌క్షం వైపే నిలిచారు సింగ‌రేణి కార్మికులు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీలోనూ ఆస‌క్తి వ్య‌క్త‌మైన సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. తెలంగాణ అధికార‌పక్షం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక‌ల్లో గులాబీ దండుకు తిరుగులేద‌ని తేల్చి చెప్పాయి.

పాల‌క టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం షార్ట్ క‌ట్ లో టీబీజీకేఎస్ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింది. మొత్తం 11 ఏరియాల‌కు తొమ్మిది ఏరియాల్లో గులాబీ కారు దూసుకెళ్లింది. సింగ‌రేణి ప‌రిధిలోని 11 ప్రాంతాల్లో గురువారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ సాగింది. మొత్తం 52,534 ఓట్ల‌కు 49,873 ఓట్లు న‌మోద‌య్యాయి. శాతంలో చెప్పాల్సి వ‌స్తే 94.93 శాతం త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. అత్య‌ధికంగా ఇల్లెందులో 98.47 శాతం మంది ఓటుహ‌క్కు వినియోగించ‌టం విశేషం. మొత్తం 1112 మందికి  1095 మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. చిన్న చిన్న ఘ‌ట‌న‌లు మిన‌హాయించి పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా ముగిసింది. పోలింగ్ ప్ర‌క్రియ త‌ర్వాత  రెండు గంట‌ల‌కే  ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఆల‌స్యంగా ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది.

మొత్తం 11 ప్రాంతాల్లో 9 ప్రాంతాల్లో గులాబీ దండు త‌మ అధిక్యాన్ని స్ప‌ష్టంగా ప్ర‌ద‌ర్శించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే  టీబీజీకేఎస్ త‌న అధిక్యాన్ని స్ప‌ష్టంగా చూపించింది. మొద‌ట ఇల్లెందు డివిజ‌న్ ఫ‌లితం వెలువ‌డింది. అప్ప‌టి నుంచే గులాబీ శ్రేణుల హ‌డావుడి మొద‌లైంది.

గురువారం అర్థ‌రాత్రి 1.30 గంట‌ల స‌మ‌యంలో తుది ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. మొత్తం 11 ఏరియాల‌కు  తొమ్మిది చోట్ల టీబీజీకేఎస్ గెలుపొంద‌గా.. రెండుచోట్ల ఏఐటీయూసీ విజ‌యం సాధించింది.  ఫ‌లితం వెలువ‌డిన వెంట‌నే టీఆర్ఎస్‌.. టీబీజీకేఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుంటూ.. మోటారు సైకిళ్ల‌తో ర్యాలీ నిర్వ‌హించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English