హ‌నీప్రీత్ అరెస్ట్ః డేరా బాబా...నాది ప‌విత్ర బంధం

హ‌నీప్రీత్ అరెస్ట్ః డేరా బాబా...నాది ప‌విత్ర బంధం

డేరా బాబా కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. రేప్ కేసులో దోషిగా తేలి రోహతక్ జైల్లో ఉన్న డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్‌ను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. మొదట ఆమెను పంజాబ్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని తర్వాత హర్యానా పోలీసులకు అప్పగించారు. ఆమెపై దేశ ద్రోహం కేసుతోపాటు డేరా చీఫ్‌ను తప్పించే కుట్రలో పాలుపంచుకుందని, హింసను ప్రేరేపించిందని కేసులు పెట్టారు. డేరా బాబాను జైల్లో వేసినప్పటి నుంచే హనీప్రీత్ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఆమె మొదట్లో నేపాల్ పారిపోయిందని అనుమానం వ్యక్తంచేశారు. అనంతరం ఢిల్లీలో కూడా ఆమె ఆచూకి కోసం సోదాలు జ‌రిపారు.

కాగా, బయటి ప్రపంచానికి ఆమె డేరా బాబా దత్త పుత్రికే అయినా.. ఈ ఇద్దరికీ లైంగిక సంబంధం ఉందని, వాళ్లెప్పుడూ ఒకే గదిలో పడుకునేవారని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆమె ఇవాళ స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణలు బాధించాయని హనీప్రీత్ వాపోయింది. ఓ తండ్రి ప్రేమగా కూతురిపై చేయి వేయడా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. పవిత్రమైన తండ్రీ, కూతుళ్ల బంధం తమ మధ్య ఉందని చెప్పింది. తనపై ఉన్న కేసులకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆమె ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసినా.. కోర్టు నిరాకరించింది. ఈ కేసులో తన తండ్రిని అనవసరంగా ఇరికించారనడంతోపాటు పంజాబ్, హర్యానా డ్రగ్ మాఫియా నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హనీప్రీత్ పిటిషన్‌లో పేర్కొంది.

కాగా, హ‌నీప్రీత్ డేరా బాబాల మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని హ‌నీప్రీత్ త‌ప్పుప‌ట్టిన‌ప్ప‌టికీ....ఈ ఆరోప‌ణ‌లు చేసింది స్వ‌యంగా ఆమె మాజీ భ‌ర్తే కావ‌డం గ‌మ‌నార్హం. గుర్మీత్‌, హనీప్రీత్‌ల మధ్య అక్రమ సంబంధం ఉందని, తన అనుచరులను తప్పుదోవ పట్టించడానికి దత్తత కుమార్తె అంటూ గుర్మీత్‌ మాయ చేసేవాడని హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా చెప్పారు. డేరా అధినేతకు చెందిన గుఫా (ఆంతరంగిక మందిరం)లో వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు తాను చూశానని, అయితే ఈ విషయం ఎక్కడైనా చెపితే తనను, తన కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారని విశ్వాస్‌ అన్నారు. డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రాంరహీంసింగ్ తన రహస్య స్థావరంలో బిగ్‌బాస్ తరహా గేమ్‌లు ఆడించేవాడని ఆయన దత్తపుత్రికగా భావిస్తున్న హనీప్రీత్‌సింగ్ మాజీ భర్త విశ్వాస్‌గుప్తా వెల్లడించారు. అంతేతాకుండా హనీప్రీత్ డేరా అధిపతి దత్తపుత్రిక కాదని అన్నారు. తన గుహలో ఆరు జంటలతో 28 రోజుల పాటు బిగ్‌బాస్ గేమ్ ఆడించారని గుప్తా చెప్పారు. విషయాలు బయటపెట్టినందుకు తనను చంపిస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. జైలులో ఉన్నప్ప‌టికీ రాంరహీం శక్తిమంతుడేనని తనను, కుటుంబ సభ్యులను చంపుతామని ఇదివరకే ఆయన అనుచరులు బెదిరించారని పేర్కొన్నారు. ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు