పొలిటిక‌ల్‌గా ర‌జ‌నీ కీల‌క అడుగు వేశారుగా

పొలిటిక‌ల్‌గా ర‌జ‌నీ కీల‌క అడుగు వేశారుగా

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌! న‌ట‌న‌ ప‌రంగా తిరుగులేని హీరో. అయితే, గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. కొంత సేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటార‌ని, మ‌రికొంత సేపు సొంత‌గా పార్టీ పెడ‌తార‌ని ఇలా అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప‌రిస్థితులు గంద‌ర గోళంగా మార‌డం, అధికార పార్టీలో చీలిక‌లు, ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, దీనిపై త‌మిళ ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు వెలువ‌డ్డాయి.

ఏదేమైనా.. ర‌జ‌నీ మాత్రం పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌ట్టిగానే డిసైడ్ అయ్యారు. తాజాగా శ‌నివారం ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని ర‌జ‌నీ పొలిటిక‌ల్ స్టెప్‌పై కీల‌క వార్త వెలుగు చూసింది. ర‌జ‌నీ అభిమాన సంఘంగా ఏర్ప‌డిన ముఖ్య నేత‌లు `ర‌జ‌నీ పైర‌వీ` పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇది పూర్తిగా త‌మిళంలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. కాగా, ర‌జ‌నీ స్థాపించే పార్టీలో చేరాల‌నుకునే కార్య‌క‌ర్త‌లు ముందుగా ఈ సైట్‌లో లాగిన్ అయి త‌మ వివ‌రాల‌ను చేర్చాలి. త‌ర్వాత తాము ఎందుకు రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్నామో, ర‌జ‌నీకి ఎందుకు మ‌ద్ద‌తివ్వాల‌ని భావిస్తున్నామో వివ‌రించి.. పార్టీ స్థాప‌న‌పై వివ‌రాలు అందించాలి.

ఆ త‌ర్వాత ఇలా రిజిస్ట‌ర్ అయిన అభిమానులు.. చిరంజీవి తీసిన స్టాలిన్ మూవీలోని కాన్సెప్ట్ త‌ర‌హాలోనే ఒక్కొక్క‌రు 10 మంది కొత్త వారిని ఈ సైట్‌కు ప‌రిచ‌యం చేయ‌డమే కాకుండా సైట్‌లో చేర్చాలి. ఈ నూత‌న సైట్ గురించి ర‌జ‌నీ అభిమాన సంఘం నేత సుధాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సైట్‌లో రిజిస్ట‌ర్ అయిన వారు ఒక్కొక్కరు 10 మందిని సైట్‌ను ఫాలో అయ్యేలా చేయాల్సి ఉంటుంద‌న్నారు.  ఈ వెబ్‌సైట్‌ ద్వారా సూపర్‌స్టార్‌ కదలికలను ఎప్పటికప్పుడు అభిమానులకు చేరవేస్తార‌ని తెలిపారు.  త‌లైవా.. ‘బాబా’ సినిమాలో వినియోగించిన ఫిలాసఫికల్‌ సింబల్‌తో పాటు ‘తమిళ్‌ వర్ధిల్లాలి - తమిళనాడు జిందాబాద్‌’ నినాదాలు పొందు ప‌రిచిన‌ట్టు చెప్పారు.  తలైవా ప్రతి కదలికను అభిమానులు తెలుసుకునేందుకే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు  సుధాకర్  వివ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English