మాజీ ప్ర‌ధాని ఓటు తొల‌గించారు

మాజీ ప్ర‌ధాని ఓటు తొల‌గించారు

మోడీ ఈ రోజు ప్ర‌ధానిగా ఉన్నారంటే అందుకు కార‌ణం ఇద్ద‌రే ఇద్ద‌రు. వారిలో ఒక‌రు లాల్ కృష్ణ అద్వానీ అయితే.. రెండో వ్య‌క్తి వాజ్ పేయ్‌. అయితే.. అద్వానీ అండ కానీ మోడీకి లేక‌పోతే వాజ్ పేయ్ ద‌న్ను ఉండేది కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివ‌ర‌కు ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్నారు. గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా ప్ర‌ధానిగా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే తాజాగా మోడీ గురువుల్లో ఒక‌రైన మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్ ఓటును తొల‌గించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

యూపీ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో న‌గ‌రంలో వాజ్ పేయ్ ఓటు ఉంది. తాజాగా ఆయ‌న ఓటును తొల‌గిస్తూ పుర‌పాలక అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా ఓట‌ర్ల జాబితా ప్ర‌చార కార్యక్ర‌మం నేప‌థ్యంలో వాజ్ పేయ్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొల‌గించాల‌ని ల‌క్నో మున్సిప‌ల్ అధికారి అశోక్ కుమార్ సింగ్ వెల్ల‌డించారు.

వాజ్ పేయ్ ఓట‌రు కార్డునెంబ‌రు 1054 అని.. ఆయ‌న చివ‌ర‌గా 2000లో జ‌రిగి అక్నో పుర‌పాల ఎన్నిక‌ల్లో త‌న ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. 2004లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చివ‌రిసారి ఓటేశారు. గ‌డిచిన కొన్నేళ్లుగా ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌టం లేదు. ముఖానికి పాక్షిక ప‌క్ష‌వాతం రావ‌టం.. ఆపై అల్జీమ‌ర్స్ తో ఆయ‌న ఇబ్బంది ప‌డుతున్నారు.

త‌న‌ను తాను గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో ఉన్న వాజ్ పేయ్‌ను బీజేపీ అగ్ర‌నేత‌లు అప్పుడ‌ప్ప‌డు వెళ్లి చూసి వ‌స్తుంటారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న ఇప్పుడు మంచానికే ప‌రిమిత‌మ‌య్యార‌ని.. మాట్లాడ‌లేర‌ని చెబుతుంటారు. ఆ మ‌ధ్య‌న భార‌త‌ర‌త్న పుర‌స్కారం ఆయ‌న ఇంట్లోనే పొందారు. అప్పుడు కూడా ఆయ‌న ముఖాన్ని క‌వ‌ర్‌చేస్తూ ఫోటోలు ప‌బ్లిష్ అయ్యాయి. గ‌డిచిన కొన్నేళ్లుగా ఆయ‌న‌ ఢిల్లీలోనే ఉంటున్న నేప‌థ్యంలో ఆయ‌న ఓటును తీసేయాల‌ని నిర్ణ‌యించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు