రాజినామా డ్రామాకు తెర తీస్తారా?

రాజినామా డ్రామాకు తెర తీస్తారా?

గత రాత్రి ఇద్దరు కళంకిత మంత్రులు ముఖ్యమంత్రిని కలిసిన తీరే చాలా అనుమానాలకు దారి తీసింది. ప్రొటోకాల్‌ ప్రకారం బులెట్‌ ఫ్రూఫ్‌ కారులో, గన్‌మెన్‌లతో కలసి రావాల్సిన హోమ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాదాసీదాగా తన పర్సనల్‌ కారులో ముఖ్యమంత్రిని కలిశారు. ఇక బులుగు రంగు బల్బు ఉన్న కారులో రావాల్సిన ధర్మాన ప్రసాదరావు, తన ఆడి కారులో వచ్చి వెళ్ళిపోయారు.

ఇదంతా చూస్తుంటే ఇద్దరూ రాజీనామా ఆస్త్రాలను సందించేవుంటారని సర్వత్రా టెన్షన్‌ నెలకొంది. అయితే ఇంతవరకు ఇటు ముఖ్యమంత్రి కిరణ్‌కాని, అటు ధర్మాన-సబితలు కాని ఈ విషయంపై మీడియాతో మాట్లాడటం కాదు కదా, కనీసం ముఖం కూడా చూపించడంలేదు

సన్నిహిత వర్గాలు మాత్రం అసలు వీరిద్దరూ రాజీనామా చెయ్యలేదనే చెబుతున్నారు. ఇంతకీ ఈ రాజీనామా డ్రామా తెరెప్పుడు తీస్తారు సార్లూ...? ఒకవేళ ఈ మంత్రులిద్దరూ రాజీనామాలు చేస్తే, ఇక తదపురి టార్గెట్‌ మరో ముగ్గురు మంత్రులేగా... మరి ఇంతమంది రాజీనమాలు చేసి వెళ్ళిపోతే సర్కారు ఏమైపోతుందో..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English