బౌలింగ్‌, బెట్టింగ్‌, ఓ శ్రీశాంత్‌!!!

బౌలింగ్‌, బెట్టింగ్‌, ఓ శ్రీశాంత్‌!!!

స్పాట్‌ ఫిక్సింగ్‌, ఫోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌, లగ్జరీ సెడాన్‌ కారులో రైడింగ్‌, పోలీసులు అరెస్టింగ్‌, ఇంతలో ముఖ్యమంత్రులకు కాల్‌ చెయ్యమని బాబు గారు ఆర్డరింగ్‌... మొత్తానికి బోడ్లో టవల్‌ దోపుకుని లక్షల్లో సంపాదిస్తున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌ ఏకంగా ఒక రాజమౌళి సినిమానే చూపిస్తున్నాడు.

ముందు నేను అమాయకుడిని అని చెప్పిన శ్రీశాంత్‌, తరువాత తన టీమ్‌ మేట్లను, వేరే బుక్కీలను చూసి ఖంగుతిన్నాడట. పైగా ఒక మరాఠి నటీమణితో రూములో దొరికిపోయాడని, కొంతమంది కాల్‌ గాల్స్‌తో మనోడు చిందేస్తున్న వీడియోలో ల్యాప్‌టాప్‌లో దొరికిపోయాయని వార్తలు బయటకు రావడంతో, శ్రీశాంత్‌ సినిమాలో కత్తిలాంటి ఇంటర్వెల్‌ బ్యాంగ్‌కు తెరతీసినట్లయ్యింది.

ఇప్పుడు కొత్తగా ఈ సినిమాకు ఒక ఫ్లాఫ్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ వినిపిస్తోంది. శ్రీశాంత్‌ బుక్కీలతో కుమ్మక్కైనట్లు రాహుల్‌కు ముందే తెలుసని, అందుకే అతన్ని టీమ్‌లోనుండి పీకిపాడేశాడని టాక్‌. అసలు ముంబైలో అరెస్టయిన రోజున, అక్కడ ముందురోజు జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌ ఆడలేదు. మొత్తానికి ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ అంశంతో శ్రీశాంత్‌ హీరోగా రూపొందించిన సినిమాకు బలే ట్విస్టిచ్చింది. చూద్దాం క్లయ్‌మ్యాక్స్‌ ఎలా ఉండబోతుందో.. ఫైనల్‌గా శ్రీశాంత్‌ తన సినిమాకు తానే ఎటువంటి రివ్యూ రాసుకుంటాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English